Skip to Content

క్రైస్తవత్వం అంటే ఏమిటి మరియు క్రైస్తవులు వేటిని నమ్ముతారు?

16 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Christianity.html

1 కొరింధీయులు 15:1-4 చెప్తుందిః “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి, దానియందే నిలిచియున్నారు. మీవిశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.”

సంక్షిప్తంగా చెప్పాలంటే, అదే క్రైస్తవత్వం యొక్క మూల విశ్వాసం. ఇతర మతాలన్నిటి మధ్యనా అనన్యమైనది, క్రైస్తవత్వం మతసంబంధమైన ఆచారాల కన్నా ఎక్కువగా ఒక సంబంధం గురించినది. “ఇది చేయి మరియు ఇదిచేయవద్దు” అన్న జాబితాకి అంటిపెట్టుకొని ఉండేకన్నా, ఒక క్రైస్తవుని గమ్యం తండ్రియైన దేవునితో ఒక అన్యోన్యమైన గమనం కోసం కృషి చేయడం. యేసుక్రీస్తు యొక్క క్రియ వల్ల మరియు పరిశుద్ధాత్మ క్రైస్తవుని జీవితంలో చేసిన పరిచర్య వల్ల ఆ సంబంధం సాధ్యమయింది. బైబిల్ దేవుని వల్ల ప్రేరేపించబడిన పొరపాటులేని దేవుని వాక్యం అని మరియు దాని బోధన అంతిమ అధికారత్వం అని క్రైస్తవులు నమ్ముతారు (2 తిమోతి 3:16; 2 పేతురు 1:20-21). ముగ్గురు వ్యక్తులలో ఉండే ఒక దేవుడిని క్రైస్తవులు నమ్ముతారు. తండ్రి, కుమారుడు( యేసుక్రీస్తుమరియు పరిశుద్ధాత్మ.

మానవజాతి దేవునితో ఒక సంబంధం ఉండేటందుకు ప్రత్యేకంగా సృష్టించబడినప్పటికీ, ఆ పాపం జనులందరినీ దేవునితో వేరుపరుస్తుందని క్రైస్తవులు నమ్ముతారు( రోమీయులు 3:23, 5:12). యేసుక్రీస్తు ఈ భూమిపైన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా నడిచి, శిలువపైన మరణించేడని క్రైస్తవులు విశ్వసిస్తారు. శిలువపైన ఆయన మరణం పిమ్మట క్రీస్తు సమాధి చేయబడి, ఆయన తిరిగి ల్రేచి, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి, విశ్వాసులకి యుగయుగాలకీ మధ్యవర్తిత్వము నిర్వహిస్తున్నాడని క్రైస్తవులు నమ్ముతారు (హెబ్రీయులు 7:25). శిలువపైన యేసు మరణం అందరివల్ల ఋణపడిఉన్న పాపానికి పూర్తిగా చెల్లించడానికి చాలినంతది మరియు ఇదే దేవునికీ మరియు నరునికీ మధ్యన ఉన్న తెగిపోయిన సంబంధాన్ని పునహ్‌స్థాపించేది (హెబ్రీయులు 9:11-14, 10:10, రోమీయులు 5:8, 6:23).

రక్షింపబడటానికి ఎవరైనా తన విశ్వాసాన్ని యావత్తూ శిలువపైన క్రీస్తు వల్ల ముగియబడిన క్రియపైన పెట్టాలంటే. క్రీస్తు తన స్థానాన్న మరణించేడని మరియు తన స్వంతపాపాలకి మూల్యాన్ని చెల్లించేడని మరియు తిరిగి లేచేడని కనుక విశ్వసిస్తే , అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడలేదు. రక్షణని సంపాదించుకొనేటందుకు ఎవరైనా చేయగలిసేది ఏదీ లేదు. మనమందరం పాపులమి కనుక, తనంతట తానే దేవుడిని సంతోషపెట్టడానికి ఎవరూకానీ చాలినంత మంచివారు కారు. రెండవదేమిటంటే, క్రీస్తు అంత క్రియనీ ముగించినందువలన, చేయబడవలిసినది ఏదీ లేదు. ఆయన శిలువపైన ఉన్నప్పుడు యేసు “ఇది సమాప్తమాయెను” అని చెప్పేడు (యోహాను 19:30).

రక్షణని పొందడానికి ఎవరూ చేయగలిగేది ఏదీ లేనట్లే, ఒకసారి ఆమె/అతడు కానీ తన విశ్వాసాన్ని శిలువపైనున్న క్రీస్తు యొక్క క్రియపైన పెట్టినప్పుడు, క్రియంతా క్రీస్తు వల్ల జరిగింపబడి, ముగిసినందువల్ల తన రక్షణని కోల్పోయేటందుకు ఎవరైనా చేయగలిసేది కూడా ఏదీ లేదు. రక్షణ గురించినదేదీ దాన్ని ఎవరు పొందుతారన్న దానిపైన ఆధారపడదు. (యోహాను 10:27-29)లో అది “ నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నాచేతిలోనుండి అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటె గొప్పవాడు కనుక, నా తండ్రి చేతిలోనుండి వాటిని యెవడును అపహరింపలేడు” అని చెప్తుంది.

“ఇది బాగుంది- ఒకసారి నేను రక్షింపబడ్డాక, నేను నాకిష్టమైనది చేసికూడా నేను నా రక్షణని కోల్పోను” అని కొందరు అనుకోవచ్చు. కానీ రక్షణ అంటే తనకి ఇష్టమైనది చేయడానికి స్వతంత్రం ఉండటం కాదు. రక్షణ అంటే పాతపాపపు స్వభావానికి పరిచర్య చేయడం నుంచి స్వతంత్రులవడం మరియు దేవునితో ఒక యుక్తమైన సంబంధాన్ని సాధించడానికి ప్రయత్నించడం. మనం ఒకానొకప్పుడు పాపానికి బానిసముగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం క్రీస్తుకి బానిసలం( రోమీయులు 6:15-22). విశ్వాసులు తమ పాపపూరితమైన శరీరాలయందు ఈ భూమిపైన జీవిస్తున్నంతకాలమూ, పాపాన్ని వదిలిపెట్టే నిరంతరమైన ఘర్షణ ఉంటుంది. ఏమైనప్పటికీ, దేవుని వాక్యాన్ని(బైబిల్ని) అధ్యయనం చేసి, దాన్ని తమ జీవితాలకి వర్తించుకుంటూ, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడుతూ ఉండి- అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావానికి లోబడుతూ, దైనందిన సందర్భాల్లో ఆత్మ యొక్క శక్తివల్ల ముందు నడుస్తూ, దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉండటంవల్ల క్రైస్తవులు పాపంతో ఘర్షణ పైన విజయాన్ని సాధించగలరు.

కాబట్టి, ఒక వ్యక్తి కొన్ని నిర్దిష్టమైన సంగతులని చేయాలని లేక చేయకూడదని అనేకమైన మతసంబంధమయిన వ్యవస్థలు కోరినప్పటికీ, క్రైస్తవత్వం మన పాపానికి మూల్యంగా క్రీస్తు శిలువపైన మరణాన్నొంది, తిరిగి లేచేడని నమ్మడం గురించే. మీ పాపపు –ఋణం చెల్లించబడింది మరియు మీకు దేవునితో సహవాసం ఉండగలదు. మీరు మీ పాపపు స్వభావంపైన విజయాన్ని పొంది, దేవునితో సహవాసంయందు మరియు విధేయతయందు మీరు నడవగలరు. అదే సత్యమైన బైబిల్‌యుతమైన క్రైస్తవత.


Share this post