Skip to Content

క్రైస్తవ జీవితంలో పాపంపై విజయం అధిగమించటం ఎలా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-victory-over-sin.html

మనము పాపంను అధిగమించే ప్రయత్నాలను బలోపేతము చేయుటకు బైబిలు అనేక రకములైన వనరులను అందిస్తుంది. మనము ఈ జీవితంలో ఎప్పటికి కూడా పాపంపై విజయాన్ని సాధించలేము ( 1 యోహాను 1:8), అయినప్పటికి అది మన గురిగా వుండాలి. దేవుని సహాయముతో ఆయన వాక్యములోని సూత్రాలను అనుసరించటం ద్వారా పాపాన్ని క్రమేణా అధిగమిస్తూ క్రీస్తు స్వారూప్యములోనికి మారగలుగుతాం.

పాపంను అధిగమించటానికి గాను బైబిలు మనకు అందించే మొదటి సహాయం పరిశుద్ధాత్ముడు. దేవుడు మనకు పరిశుద్ధాత్ముని అనుగ్రహించింది జయోత్సాహాపు క్రైస్తవ జీవితం కోసమే. శారీరక క్రియలకు ఆత్మీయఫలాలకు ఖచ్చితమైన వ్యత్యాసాన్ని గలతీ 5:16-25 లో దేవుడు చూపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఆత్మీయాను సారముగా నడచుటకు దేవుడు మనలను పిలిచాడు. విశ్వాసులందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయినప్పటికి ఈ విశ్వాసాన్ని బట్టి మనలను పరిశుద్ధాత్మునికి అప్పగించుకొని ఆత్మానుసారముగా నడచుకోవాలని భోదిస్తుంది. దీని అర్థం మనం నిలకడగా పరిశుద్ధాత్ముని యొక్క మెల్లని స్వరానికి స్పందించాలి గాని శరీరానికి కాదు.

పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొస్తాడో పేతురు జీవితం ద్వారా ప్రస్పుటం అవుతుంది- పరిశుద్ధాత్మునితో నింపబడకమునుపు యేసుయెవరో తెలియదని మూడుసార్లు బొంకిన వ్యక్తి, తర్వాత మరణమువరకు క్రీస్తును వెంబడించటానికి సిద్దపడ్డాడు. పెంతెకోస్తుదినాన్న పేతురు పరిశుద్ధాత్మునితో నింపబడిన తర్వాత బాహాటముగా , ధైర్యముగా యూదులతో మాట్లడాడు.

పరిశుద్ధాత్ముని ప్రేరణలను ఆర్పకుండటం ద్వారా ఆత్మానుసారముగా నడుస్తాం (1 ధెస్సలోనీయులకు 5:19 చెప్పిన రీతిగా) మరియు ఆత్మ నింపుదలకై ప్రయత్నించాలి (ఎఫెసీ 5:18-21). పరిశుద్ధాత్ముని నింపుదల ఒకడు ఏవిధంగా పొందగలడు? మొట్టమొదటిగా పాతనిబంధనవలే ఇది దేవుని ఎంపిక. తన కార్యాలను నెరవేర్చటానికి తాను ఎంపిక చేసుకున్న వ్యక్తులను తన ఆత్మతో నింపాడు (ఆదికాండం 41:38; నిర్గమకాండం 31:3; సంఖ్యాకాండం 24:2; 1 సమూయేలు 10:10). ఎవరైతే దేవుని వాక్యంచేత తమ జీవితాలను నింపుకుంటారో వారిని తన ఆత్మచేత నింపుతాడని ఈ రెండు వాక్యములు, ఎఫెసీయులకు 5:18-21; మరియు కొలొస్సీయులకు 3:16 ద్వారా ఋజువు అవుతుంది. ఇది రెండవ సాధనం లోనికి నడిపిస్తుంది.

దేవునివాక్యమైన బైబిలు చెప్తుంది దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి మంచి కార్యముచేయటానికి సన్నద్దపరుస్తాడు (2 తిమోతి 3:16-17). ఎలా జీవించాలో, దేనిని నమ్మాలో అని భోధిస్తుంది. తప్పు మార్గాన్ని ఎంపిక చేసుకున్నపుడు బహిర్గతముచేస్తుంది, సరియైన మార్గములోనికి రావడానికి దోహదపడ్తుంది, సన్మార్గములో స్థిరపడటానికి సహాయపడ్తుంది. హెబ్రి 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా వుండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను శోధించుచున్నది. కీర్తనకారుడు 119 లో జీవన విధానము మార్చడంలో వాక్యము ఎంత శక్తివంతమైనదో భోధిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధించటానికి మూలం తనకప్పగించబడిన వాక్యమును మర్చిపోకుండా దివారాత్రము దానిని ధ్యానించుటయే విజయ రహస్యమని తెలిపాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆఙ్ఞ యుద్ధపరిస్థులు భిన్నమైనప్పటికి, అర్థరహితమైనప్పటికి, విధేయత చూపించటం ద్వారా వాగ్ధానపు దేశము చేరుకోవటంలో వచ్చిన యుద్దాలపై విజయం సాధించాడు.

తరచుగా ఈ బైబిలును మరి చులకనగా చూస్తాం. బైబిలును నామకార్థంగా చర్చికి తీసుకువెళ్తాం. అనుదినం ఒక అధ్యాయం చదువుతాం, కాని దానిని ధ్యానించము, మననం చేయం, మన జీవితానికి అన్వయించుకోము. పాపాలను ఒప్పుకోవటం విషయములో, దేవుడు బహిర్గతము చేసిన విషయములో, మరియు దేవుని స్తుతించే విషయములో విఫలులమౌతాం. బైబిలు విషయాలకు వచ్చేటప్పడికి బీడు పట్టిన వారివలే వుంటాం. అయితే కేవలం అత్మీయంగా సజీవంగా వుండటానికి సరిపడే వాక్యాన్ని తీసుకోడానికి ఇష్టపడతాం (ఆరోగ్యవంతమైన క్రైస్తవులుగా వుండటానికి సరిపడే ఆహారం తీసుకోం), లేక వాక్యాన్ని తరచుగా చదివిన ఆత్మీయంగా బలముపడే విధంగా అధ్యయనం చేయము.

అనుదినము దేవుని వాక్యామును చదివి అధ్యయనం చేయుట అలవాటుగా మార్చుకోవటం అవసరం. కొంతమంది దినచర్య (డైరి) రాసుకోవటం అలవాటు. దేవుని వాక్యంలోంచి పొందిన ఏదో లాభం రాసేటంతవరకు విడచి పెట్టకుండా అలవర్చుకోవాలి. కొంతమంది దేవుడు వారికి సూచించిన, బహిర్గతము చేసినటువంటి మార్పు విషయమై తాము చేసిన ప్రార్థనలను రాసుకొంటూవుంటారు. బైబిలు పరిశుద్ధాత్ముడు యుపయోగించే ప్రాముఖ్యమైన పరికరము(ఎఫెసీ 6:17). ఆత్మీయ పోరాటములో దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన యుద్ధోపకరణము (ఎఫెసీ 6:12-18).

పాపంపై పోరాటములో మూడవ ప్రాముఖ్యమైన సాధనం ప్రార్థన. క్రైస్తవులు ఎక్కువ శాతం ప్రార్థనను కూడ అవసరానికి మట్టుకే వుపయోగించేకొనే సాధనం. ప్రార్థన కూడికలు మరియు ప్రార్థన సమయాలు వున్నప్పటికి మొదటి శతాబ్ధపు సంఘంవలే మనం వుపయోగించలేదు (అపోస్తలుల కార్యములు 3:1; 4:31; 6:4; 13:1-3). తాను పరిచర్య చేయువారికోసం ప్రార్థించే వాడని పౌలు పలుమార్లు ప్రస్తావించాడు. దేవుడు ప్రార్థన విషయములో అనేక వాగ్ధానాలను ఇచ్చాడు (మత్తయి 7:7-11; లూకా 18:1-8; యోహాను 6:23-27; 1 యోహాను 5:14-15), ఆత్మీయపోరాటము గురించి రాసినటువంటి దానిలో పౌలు ప్రార్థన యుద్దోపకరణముగా చర్చించాడు (ఎఫెసి 6:18).

పాపంను అధిగమించటంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది? గెత్సేమనేతోటలో పేతురు క్రీస్తును ఎరుగనని బొంకి పలికిన మాటలు మనకున్నాయి. క్రీస్తు ప్రార్థించుచుండగా పేతురు నిద్రపోయాడు. యేసయ్య అతనిని లేపి ఇట్లన్నాడు “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనము” ( మత్తయి 26:41). పేతురువలే మనము కూడ చాలసార్లు సరియైనదే చేయాలనుకుంటాము గాని శక్తి చాలదు. మనము దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఙ్ఞాపకముంచుకొని, అడిగేవాళ్ళము, తట్టే వాళ్ళము, వెదికే వాళ్ళముగా వుంటాము. అప్పుడు ఆయన కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఒక మంత్రము కాదు. ప్రార్థన అనేది మన బలహీనతలను ఒప్పుకొంటూ దేవుని అపార శక్తిని , సామర్ద్యతను అంగీకరిస్తూ మనము కాక ఆయన కోరిన దానిని చేయటానికి శక్తికోసమే ఆయనవైపు తిరగటం (1 యోహాను 5:14-15).

పాపంపై విజయానికి నాల్గవ ప్రాముఖ్యమైన సాధనం సంఘం లేక ఇతర విశ్వాసులతో సహవాసం. యేసయ్య తన శిష్యులను పంపించినపుడు ఇద్దరిద్దరిగా పంపించాడు (మత్తయి 10:1). ఆదిఅపోస్తలులు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలేదు, ఇద్డరిద్దరిగాగాని లేక గుంపుగా గాని వెళ్ళారు. యేసయ్య అఙ్ఞ ఇచ్చినట్లు సమాజముగా కూడుట మానక, ప్రేమనుచూపుటలో మంచి కార్యముల చేయునిమితమై ఒకరినొకరు పురికొల్పుకొనుచు హెచ్చరించుట మానకూడదు (హెబ్రీయులకు 10:24). మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి (యాకోబు 5:16)అని ఆయన చెప్తున్నాడు. పాతనిబంధనలోని సామెతలు చెప్తున్నట్లు ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును (సామెతలు 27:17). మంది ఎక్కువగా వుండుటవలన ఎక్కువ శక్తి ఉంటాది(ప్రసంగి 4:11-12).

మొండి పాపంపై విజయం సాధించుటానికి జవాబుదారియైన సన్నిహితుడు లేక తోటి విశ్వాసి వుండుట చాలా లాభధాయకమని చాలామంది క్రైస్తవులు గ్రహించారు. నీతో మాట్లాడి, నీతో ప్రార్థనచేసే, నిన్ను ప్రోత్సాహించే, అవసరమయితే నిన్ను ఖండించే మరో వ్యక్తి వుండటం ఎంతైనా ప్రయోజనకరం. అందరు శోధించబడతారు. జవాబుదారియైన వ్యక్తి లేక గుంపు మనము ఎదుర్కోనే మొండి పాపములపై విజయానికి అంతిమ ప్రోత్సాహాం, మరియు ఉత్తేజము.

కొన్నిసార్లు పాపంపై విజయం చటుక్కున వచ్చేస్తుంది. మరి కొన్ని సార్లు దీర్ఘకాలం పడ్తుంది. దేవుడు మనకిచ్చిన వనరులను వాడుతున్నప్పుడు మన జీవితంలో క్రమేణా మార్పు అనుగ్రహిస్తాడని వాగ్ధానం చేసాడు. పాపమును అధిగమించుటలో మనము జీవితంలో ప్రదర్శించటానికి నేర్చుకోవాలి ఎందుకంటే వాగ్ధానం నెరవేర్చుటలో ఆయన నమ్మదగినవాడు.


Share this post