Skip to Content

కన్యక గర్భము ధరించుట ఎందుకు అంత ప్రాముఖ్యమైంది?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-virgin-birth.html

కన్యక గర్భము ధరించుట అనే సిధ్ధాంతము చాల కీలకంగా ప్రాముఖ్యమైంది. (యెషయా 7:14; మత్తయి 1:23; లూకా 1:27, 34). మొదటిగా లేఖానాలు ఏవిధంగా ఈ సంఘటనను వివరిస్తుందో పరిశీలిద్దాము. మరియ ప్రశ్నకు యిదెలాగు జరుగును? (లూకా 1:34)అని దూతతో పలుకగా, దానికి ప్రతిస్పందనగా దూత - పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుధ్ధుడై దేవుని కుమారుడనబడును(లూక 1:35)అని చెప్పెను. దేవునిదూత యోసేపును ప్రోత్సాహపరుస్తు నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమే గర్భము ధరించినది పరిశుధ్ధాత్మ వలన కలిగినది (మత్తయి1:20). మత్తయి నిర్థారించేది ఏంటంటే వారేకము కాకకమునుపే అంటే కన్యకగా నున్నప్పుడే ఆమే పరిశుధ్ధాత్మునివలన గర్భవతిగా నుండెను (మత్తయి 1:18). దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీ యందు పుట్టి అని గలతీ 4:4 కూడా కన్యక గర్భమును గూర్చి భోధిస్తుంది.

ఈ పాఠ్యాభాగాలనుంచి మనకు చాల స్పష్టముగా అర్థము అయ్యేదేంటంటే యేసు జన్మ ఫలితమే మరియ శరీరములో పరిశుధ్ధాత్ముడు జరిగించిన కార్యము. అభౌతికమైన(ఆత్మ) భౌతికము (మరియ గర్భము)రెండును కలిసి పాల్గొనెను. మరియ తన్ను తాను గర్భవతి చేసుకొనుటకు అవకాశములేదు, ఎందుకంటే ఆమె ఒక సామాన్యమైన పనిముట్టు లాంటిది. దేవుడు మాత్రమే అవతరించుట అనే అధ్భుతమును చేయగలడు.

ఏదిఏమైనప్పటికి, యోసేపు మరియల మధ్య శారీరక సంభంధమును నిరాకరించుటను అట్టి యేసు నిజమైన మానవుడు కాడు అని సూచిస్తుంది. యేసు సంపూర్తిగా మానవుడే, మనకు లాగా శరీరమును కలిగియున్నాడని అని లేఖనము భోధిస్తుంది. ఇది మరియ దగ్గర్నుండి పొందుకున్నాడు. అదే సమయంలో యేసు నిత్యమైన, పాపములేని స్వభావముతో సంపూర్తిగా దేవుడే (యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీయులకు 2:14-17.)

యేసు పాపములో పుట్టినవాడు కాదు అంటే ఆయన స్వభావములో పాపములేదు (హెబ్రీయులకు 7:26). తండ్రినుంచి ఒక తరమునుండి మరొక తరముకు పాపస్వాభావము సంప్రాప్తమైనట్లు అగుపడుతుంది (రోమా 5: 12, 17,19). పాపపు స్వభావమును ప్రసరించే గుణాన్నినుండి తప్పించుకొనుటకు కన్యక గర్భము ధరించుట దోహదపడింది మరియు నిత్యుడైన దేవుడ్ని పూర్తిమంతమైయున్న మానవుడుగా అవతరించుటకు అనుమతికలిగింది.


Share this post