Skip to Content

జూదము పాపమా? బైబిలు జూదము గురించి ఏమి చెప్తుంది?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-gambling-sin.html

జూదము, పందెంలో పాల్గొనుట, లాటరీ టిక్కెట్టులు కొనడం వంటివి బైబిలు స్పష్టముగా ఖండించదు. అయితే బైబిలు మాత్రము ఖచ్చితముగా ధనాపేక్షకు దూరంగా వుండమని హెచ్చరిస్తుంది (1 తిమోతి 6:10; హెబ్రీయులకు 13:5). త్వరగా డబ్బు సంపాదించే ప్రయత్నంనుండి దూరంగా వుండమని బైబిలు ప్రోత్సాహిస్తుంది(సామెతలు 13:11; 23:5; ప్రసంగి 5:10). జూదము ఖచ్చితముగా ధనాపేక్షకు కేద్రంగా కలిగియున్నది. మరియు జూదము డబ్బు సంపాదించటమే కేంద్రితమై యున్నది కాబట్టి త్వరితగతిలో సులభ పద్దతుల ద్వారా డబ్బు సంపాదించాలాని ప్రజలకు వాగ్ధానం చేస్తూ శోధిస్తుంది?

జూదము తప్పేంటి? జూదము అది చాలా కష్టమైనది. పరిమితం కాబట్టి దాని గురించి ఆలోచించుట చాలా కష్టము. అప్పడప్పుడు ఆడేది కాబట్టి ధానాన్ని వృధాచేస్తుంది. అయితే అది అవసరమైన దురచారం కానే కాదు. ప్రజలు వేర్వేరు కలాపాలకు ధానాన్ని వృధాచేస్తారు. లేక డబ్బును వృధాచేస్తారు. జూదము కూడా ఇతర కార్యకలాపాలకు సమయాన్ని , ధనాన్ని వెచ్చించినట్లుగానే వుంటుంది. ఉదాహరణకు సినిమాకు వెళ్ళటం, హొటళ్ళో ఖరీదైన భోజనం చేయటం లేక ఉపయోగం లేకపోయిన ఎంతో ఖర్చుపెట్టి వస్తువు కొనడం వంటిది. అదే సమయంలో ఇతర విషయములో డబ్బు వృధాచేయటంతో సమానంగా పోల్చటంనుబట్టి జూదాన్ని సమర్థించలేము. డబ్బును వృధాచేయకూడదు. మిగులు ధానాన్ని భవిష్యత్తు అవసరతలకొరకు నిలువచేసుకోవాలి లేక ప్రభువు పనికి ఇవ్వాలిగాని జూదములో పెట్టుకొనకూడదు.

బైబిలు జూదముగురించి స్పష్టముగా ప్రస్తావించకపోయినప్పటికి “అదృష్టము”, “ఆకస్మిక అవకాశము”, అనుకోకుండ వచ్చిన అంశాలు గురించి పేర్కొంటుంది.ఉదాహరణకు లేవీకాండంలో బలి ఇచ్చే కోడెను , విడువబడే కోడెను నిర్ణయించటానికి చీట్లువేసేవారు. యెహోషువాకు వేరు వేరు గోత్రాలకు భూభాగాలను నిర్ణయించటానికి చీట్లు వేసారు. యెరూషలేము గోడలోపల భాగములో ఎవరు నివసించాలో నిర్ణయించటానికి యెహోషువా చీట్లు వేసాడు. అపోస్తలులు ఇస్కరియోతు యూదాకు మారుగా శిష్యుని ఎంపిక చేయుటకు చీట్లు వేసెను.సామెతలు 16:33 లో చీట్లు ఒడిలో వేయబడును. వాటివలని తీర్పు యెహోవా వశము అని చెప్తుంది.

బైబిలు కసినోలు, క్లబ్బులు, చీట్లువేయటాన్ని గురించి ఏమి చెప్తుంది? క్లబ్బులు, కసినోలు, జూదగాళ్ళను ఆకర్షించటానికి డబ్బు వెచ్చించటానికి, వేరు వేరు వ్యాపార పద్దతులు ఉపయోగిస్తారు. ఉచితముగా లేక చవకగా లభించే మద్యము ద్వార త్రాగుడును ప్రోత్సాహించి తెలివిగా నిర్ణయము తీసుకొనే స్థోమతను, సామర్ధ్యతను కోల్పోయేటట్లు చేస్తారు. ఇటువంటి క్లబ్బులో జూదము ద్వారా డబ్బును కోల్పోవటం తప్పించి సంపాదించటం అనేది వుండదు. అయితే నిరుపయోగమైన సరదా మాత్రం వుంటుంది. కొంతమంది లాటరీ టిక్కెట్టు ద్వారా విద్య లేక సాంఘీక ప్రయోజనాలకు అంటూ మబ్బి పెడ్తారు. ఏదిఏమైనప్పటికి ఒక సర్వే ప్రకారము లాటరీ టిక్కెట్లు కొనడం ఎక్కువశాతంమంది ఆ టిక్కెట్లను కొనడానికి కూడా స్థోమత లేనివాళ్ళు, త్వరగా గొప్పవాళ్ళు అవ్వచ్చు అనేది పెద్ద శోధన. నిరాశలో వున్నవారు దాని కాదు అని అనలేరు. గెలుపు అవకాశాలు చాలా తక్కువ దాని పర్యవసానంతో అనేకమంది జీవితాలు నాశనమవుతాయి.

లాటరీ నుంచే వచ్చేడబ్బులు దేవునిని సంతోషపరుస్తాయా? చాలామంది జూదం, లాటరీల ద్వారా డబ్బు సంపాదించి మంచి పనులకు లేక నష్టాలకు ఉపయోగిస్తామంటారు. ఉద్దేశ్యం మంచిదిగా కనబడినప్పటికి వాస్తవానికి కొద్ది మంది మాత్రమే దైవికమైన అవసరతలకు జూదము నుంచి సంపాదించిన డబ్బు మాత్రం వినియోగిస్తారు. ఒక సర్వే ప్రకారము జాక్ పాట్ ను సంపాదించిన తర్వాత కూడా ఆర్థికంగా దయనీయమైనటువంటి పరిస్థితిలో లాటరీ ఆటగాళ్ళున్నారు. కొద్దిమంది మత్రమే వాస్తావికంగా డబ్బును మంచి కారణానికి వాడతారు. పైగా దేవునికి ఇటువంటి సొమ్మును తన పరిచర్యకు అవసరం లేదు. సామెతలు 13:11 లో మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసికొనును. దేవుడు సార్వభౌముడు తన సంఘ అవసరతలకు తాను యదార్థమైన పద్దతిలో అనుగ్రహిస్తాడు. దొంగ తనం లేక తప్పుడు పద్దతి ద్వారా, మారక ద్రవ్యము ద్వారా సంపాదించి ఆ డబ్బు దేవునికి ఘనతనివ్వగలిగిందా? ముమ్మాటికి కాదు. అంతేకాదు పేదవాడ్ని గొప్పవాళ్ళను చేస్తామని మోసం ద్వారా దొంగిలించిన డబ్బుకూడా దేవునికి అవసరంలేదు.

1తిమోతి 6:10 లో ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాభాధాలతో తమ్మును తామే పొడుచుకొనిరి. హెబ్రీయులకు 13:5 లో ధనాపేక్ష లేనివారై మీకు కలిగినవాటిలో తృప్తిపొంది యుండుడి - నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. మత్తయి 6:24 ఈ విధంగా ప్రకటిస్తుంది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.


Share this post