Skip to Content

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-God-speak.html

మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడినట్లు బైబిలు అనేక మార్లు పేర్కోంటుంది (నిర్గమకాండం 3:14; యెహోషువ 1:1; న్యాయాధిపతులు 6:18; 1 సమూయేలు 3:11; 2 సమూయేలు 2:1; యోబు 40:1; యెష్షయా 7:3; యిర్మియా 1:7; అపోస్తలుల కార్యములు 8:26; 9:15 – ఇది ఒక చిన్న ఉదాహారణకు మాత్ర మే. ఈ దినాలాలో మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడకూడదని లేక మట్లాడకూడదు అని అంటానికి బైబిలులో ఏ కారణము లేదు. కొన్ని వందసార్లు బైబిలులో పేర్కొన్నట్లుగా మాట్లాడిన దేవుడు నాలుగు వేల సంవత్సరాల మానవ చరిత్రలో మరల జరిగిందిఅని మనము గుర్తించుకోవాలి. దేవుడు వినబడగలిగేటట్లు మాట్లాడుట అనేది ప్రత్యేక సంఘటననేగాని అది నియమము కాదు. బైబిలులో దేవుడు మానవులతో పలుమార్లు మాట్లాడాడు అని పేర్కొన్నప్పుడు అది వినబడిగలిగే స్వరమా లేక అంతర్గత ఆలోచన ఒక మానసికమైన ఆలొచన అన్నది వివరించలేం.

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతూనే ఉన్నాడు. మొదటిగా ఆయన వాక్యము ద్వార మట్లాడుతున్నాడు ( 1 తిమోతి 3:16-17). యెష్షయా 55:11 ఈ విధంగా చెప్తుంది నిష్ఫలముగా వాక్యము నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మనము రక్షింపబడుటకు గాను మరియు క్రైస్తవ జీవన విధానములో జీవించుటకుగాను అన్ని విషయములను తెలిసికొనుటకు దేవుని వాక్యమను బైబిలులో ముందుగానే పొందుపరిచెను. రెండవ పేతురు 1:3 ఈ విధంగా తెలియ పరుస్తుంది, తన మహిమను బట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దివ్యశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున.

రెండవదిగా, ప్రకటించిన విధంగా దేవుని వాక్యమును దేవుడు వాటిని సంఘటనల ద్వారా అభిప్రాయాలద్వార మాట్లాడుతాడు (1 తిమో తి 1:5; 1 పేతురు 3:16). మనస్సాక్షిద్వారా మంచి చెడులను గ్రహించటానికి తన అలోచనలను మనము కలిగియుండేటట్లు మన మనస్సులనురూపంతరపరిచే ప్రక్రియలలో దేవుడున్నాడు (రోమా 12:2). దేవుడు మన జీవితాలలో కొన్ని సంఘటనలను అనుమతించటం ద్వారా మనల్ని నడిపిస్తాడు. మనలను మారుస్తాడు మరియు ఆత్మీయంగా సహాయపడుతాడు (యాకోబు 1:2-5; హెబ్రీయులకు 12:5-11). మొదటి పేతురు 1:6-7 ఙ్ఞప్తిలోకి తెస్తుంది ఏంటంటే ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెముకాలము మీకు దు:ఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలవలన శుధ్ధపరచబడుచున్నదిగదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును.

చివరిగా దేవుడు కొన్ని పర్యాయాలు మానవులకు వినబడగలిగేటట్లు మాట్లాడవచ్చు. అయితే పలువురు పేర్కోనేటట్లు అనేక పర్యాయములు ఈ ప్రక్రియ జరుగుతుంది అన్న మాట అనుమాస్పదమే. మరియు బైబిలులో పేర్కోనేటట్లు, దేవుడు వినబడగలిగేటట్లు మాట్లాడటం అనేది ప్రత్యేకమైన విషయముగాని సాధారణమైంది కాదు. ఎవరైనా దేవుడు నాతో మట్లాడాడు అని చెప్పితే ఆ మాటలను వాక్యానుసారమైనందా కాదా అని బేరీజు వేసుకోవాలి. నేటి దినాలలో దేవుడు ఒకవేళ మట్లాడినట్లయితే ఆ మాటలు బైబ్నిలులోనే పేర్కొన్నమాటలతో అంగీకారముగానే వుంటుంది (1 తిమోతి 3:16-17). దేవుడు తనకు తాను విరుద్దముగా ప్రవర్తించడు.


Share this post