Skip to Content

ఎప్పుడు/ ఏవిధంగా పరిశుధ్ధాత్మను పొందుకుంటాం?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-receive-Spirit.html

అపోస్తలుడైన పౌలు స్పష్టముగా భోధిస్తున్నాడు ఏంటంటే మనము యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకుంటాము. 1 కొరింథి 12:13 ఏలాగనగా యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి. రోమా 89 చెప్తుంది ఒకవ్యక్తిలో పరిశుధ్ధాత్మను లేనివాడైతే అతడు/ఆమె క్రిస్తుకు చెందినవాడు కాడు: దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మ స్వభావముగలవారే గాని శరీరస్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. ఎఫెసీ 1:13-14 భోధిస్తుంది అయనయందు విశ్వాసముంచినవారికి రక్షణ అనే పరిశుధ్ధాత్మను ముద్రనుంచియున్నాడు మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్ధానముచేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

ఈ మూడు పాఠ్యభాగాలు యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకుంటామని స్పష్టము చేస్తున్నాయి. పౌలు చెప్పలేకపోయాడు అది మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమని, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమని ఎందుకంటె కొరింథీ విశ్వాసులు అందరు పరిశుధ్ధాత్మను కలిగియున్నారని. రోమా 8:9 ఇంకా గట్టిగా చెప్తుంది ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడని. కాబట్టి ఒకడు ఆత్మను కలిగియుండటం అనేది ఒకడు రక్షణను కలిగియున్నాడనుటకు గుర్తింపుగానున్నది. పైగా పరిశుధ్ధాత్మడు రక్షణకు ముద్రగాలేడు (ఎఫెసీ1:13-14) ఎప్పుడంటే రక్షణపొందిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందనపుడు. చాల వాక్యభాగాలు స్పష్టముచేస్తున్నావేంటంటే యేసుప్రభువును రక్షకునిగా విశ్వాసముంచిన క్షణములోనే మన రక్షణ భద్రముచేయబడినది.

ఈ చర్చ చాల వివాదమైనది ఎందుకంటే పరిశుధ్ధాత్ముని యొక్క పనులు తరచుగా కలవరపరుస్తాయి. యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకోవటామా లేక పరిశుధ్ధాత్మ నింపుదలయా. పరిశుధ్ధాత్మ నింపుదలను కలిగియుండటం అనేది క్రైస్తవజీవితములో కొనసాగుతుండే ప్రక్రియ. కొందరు విశ్వసించేది రక్షణ పొందిన సమయంలోనే పరిశుధ్ధాత్మ బాప్తిస్మము కూడ జరుగును అని , మరికొంతమంది క్రైస్తవులు అది నమ్మరు. ఇది కొన్ని సార్లు పరిశుధ్ధాత్మ బాప్తిస్మమునకు బదులు పరిశుధ్ధాత్మను పొందుకోవటంతో తారుమారు చేస్తుంది అటుపిమ్మట ఇదే రక్షణ కార్యమునకు కారణమౌతుంది.

చివరిగా, మనము ఏవిధంగా పరిశుధ్ధాత్మను పొందుకుంటాం? కేవలము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుటను బట్టి పరిశుధ్ధాత్మను పొందుకుంటాం (యోహాను 3:5-16). ఎప్పుడు పరిశుధ్ధాత్మను పొందుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినపుడే పరిశుధ్ధాత్ముడు మనలో శాశ్వతముగా నివసించును.


Share this post