Skip to Content

ఏదేనులో యుద్ధం

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General


మీకు తెలుసా ?


ఏదేను తోటలో సాతాను అవ్వను,

ఆదామును మోసం చేసి దేవుని

నుండి దేవుని ప్రతి రూపమైన

మనిషిని వేరు చెయ్యటానికి

ఉపయోగించిన

ప్రదాన ఆయుధాలు ఏంటో??

(ఆదికాండము 3:6) స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు( ఇది శరీర ఆశ )

కన్నులకు అందమైనదియు, ( ఇది నేత్ర ఆశ )

వివేకమిచ్చు రమ్యమైనదియు ( ఇది జీవపుడంబము)

నై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

సాతాను పాము రూపంలో అవ్వకు చెప్పిన మాటలు అవ్వ విని సాతాను శరీర ,నేత్ర ,జీవపుడంబం అనే ఈ మూడు ఆయుధాలకు బలి అయింది

గమనించారా??

ప్రియ సహోదరా/సోహోదరీ!


సాతాను ప్రధాన మరణపు ఆయుధాలు

1)శరీర ఆశ

2)నేత్ర ఆశ

3)జీవపు డంబము

సాతాను ఈ మూడు ఆయుధాలను

ఏదేను తోటలో అవ్వ, ఆదాము పై

ప్రయోగించి సర్వోన్నతుడు ,సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుని రెక్కలచాటు

సన్నిధి నుండి మానవాళిని

వేరు చేసి నరకం అనే దైవోగ్రతను

సంపాదించి పెట్టేడు


ఏదేను యుద్ద భూమి లో సాతాను

ప్రయోగించిన బలమైన

ఈ శరీరాశ ,నేత్రాశ ,జీవపుడంబం అనే

ఈ మూడు ఆయుధాలు తగిలి

ఆదాము అవ్వల ఆత్మీయ జీవితం

అంతరించి పోయింది

సాతాను సామ్రాజ్యపు

కేంద్ర బిందువు గా ఏదేను

మారిపోయింది


అంతరించిన దేవుని పిల్లల

ఆధిపత్యానికి ,,

అవతరించిన

సాతాను సామ్రాజ్య ఆధిపత్యానికి

ఒక సాక్షిగా ఏదేను మిగిలి పోయింది


సృష్టి కర్తకు,మరియు సృష్టించబడిన

ఆదాము అవ్వలకు మద్యలో

అవధులు లేని శూన్యం అలుముకుంది

ఆ శూన్యపు అంచులవరకు

అంతుపట్టని ఆనందం తో సాతాను

దూతల ఆనంద వీరవిహారం తో

చప్పట్లు కేరింతలతో నిండి పోయింది


పేరు లేని ప్రతి పక్షికి ,ప్రతి జంతువుకి

పేరు పెట్టి ప్రేమించిన మన పితురుడు

ఉన్నపట్టుగా ఏదేను ను ఖాళీ

చెయ్యవలసి వచ్చింది


ప్రతి జంతువుకు, పక్షికి వెళ్లి పోతున్న

ఆదాము తో ఉన్న అనుభందం ,

ఆప్యాయత ,అంతరంగాలలో

మెదులుతున్నప్పటికి

సాతాను కొత్త నాయకుడికి

స్వాగతిస్తూ ఏదేను లో

జేజేలు కొట్టవలసి వచ్చింది


సాతాను కు ఊహించని గొప్ప విజయం

సంపాదించి పెట్టిన

( శరీర ఆశ ,నేత్రాశ ,జీవపుడంబం)

అనే ఆయుధాలు ను విశ్వ సామ్రాజ్య

వాప్తికోరకు సాతాను ప్రధాన

ఆయుధాలుగా ఈ

భూలోకమంతా ప్రకటించాడు



కాల గమనం లో 4000 ఏండ్లు

గడిచాయికాలం పరిపూరమైనప్పుడు

మన దేవాది దేవుడు రక్షణ కర్త

ఏదేను లో ఆదాము కి దేవుడికి

ఏర్పడ్డ శూన్యం ని దాటుకుని

సర్వ మానవాళి రక్షణకై,అపవాది

ముందు ఎత్తైన కొండమీద శోధన

అనే యుద్ద రణరంగ భూమి పై

సాతాను ముందు నిలబడ్డాడు


వెంటనే సాతాను ఏదేను తోటలో

ఏ ఆయుధాలు అయితే

ఆదాము దంపతులపై గొప్ప

విజయం సంపాదించి పెట్టాయో

సరిగ్గా ఒక్కటి మర్చిపోకుండా అవే ఆయుదాలు

(శరీర ఆశ ,నెత్రాశ, జీవపుడంభము )

ను ఎత్తైన కొండమీద బయటకు తీసేడు




సాతాను యేసయ్య మీద గురిపెట్టిన ఆయుధాలు


ఈ రాళ్ళును రొట్టెలాగా మార్చు

(శరీర ఆశ)

Matthew 4:3


ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి

యేసు కి ఈలోకరాజ్యాలు

చూపిం చాడు(నేత్రాశ)

(matthew4:8)


నాకు నమస్కరిస్తే ఈ రాజ్యాలన్నీ

నీకు ఇస్తాను అన్నాడు

(జీవపు డంభము)

(Matthew 4:9)


బహుషా

తిండి పుష్కలంగా దొరికే ఏదేను

తోటలోనే అవ్వాఆదాము

రమ్యమైన పండు అనేే

తిండి ఆయుధానికి పడిపోయారు



ఒక చుక్క నీటి బొట్టు గాని

ఒక ముద్ద ఆహారం గాని

దొరకని కటిన రాళ్ళఅరణ్యంలో

ఎత్తైన కొండమీద "రాళ్ళు ను

రొట్టెలాగా మార్చు"

అనే తిండి ఆయుధానికి యేసు,

యిట్టె పడిపోతాడు అనేే

విశ్వాసం తో సాతాను

యుద్దానికి దిగి ఉంటాడు


సాతాను ,ఆదాము పై ఏ

ఆయుధాలను ఐతే ఎక్కుపెట్టేడో

అవే ఆయుధాలను

పదును పెట్టి మరలా

ఎత్తైన కొండ యుద్ద భూమి లో

యేసు క్రీస్తు పై ప్రయోగించాడు


ఈ సారి యుద్ద భూమి లో ఉన్నది మొదటి ఆదాము కాదు

ఈయన కడపటి ఆదాము


ఐతే మన ప్రభువు యుద్ధంలో

సాతాను ఆయుధాలను వాక్యం

తో తిప్పికోట్టేడు

యేసుకి విజయం తధ్యం అని

ఉహించిన సాతాను యుద్ధం

మధ్యలోనే యేసుని వదిలి యుద్ద

భూమిలోనుండి పారిపోయాడు

చివరికి యేసు గొల్గొతా కొండమీద

సాతానుని జయించారు

సాతాను ని నిరాయుధ దారుడిగా చేసి

ఏదేను లో పోగొట్టుకున్న రాజ్యం

తిరిగి మానవుడికి ఇచ్చారు



(1 యోహాను 2:16)

లోకములో ఉన్నదంతయు, అనగా

1)శరీరాశయు

2)నేత్రాశయు

3)జీవపుడంబమును

తండ్రివలన పుట్టినవి కావు;

అవి లోకసంబంధమైనవే


అవును ప్రియమైన విశ్వాసులారా

శరీర ఆశ ,నేత్రాశ,జీవపు డంబం

అనేవి ఒక లోక సంభంద మైనవి

దేవుని వలన పుట్టినవి ఏమాత్రం కావు


సాతాను విజయానికి ఈమూడు ఆయుధాలు పట్టుకోడం అయితే

క్రీస్తును నమ్మిన నీకు ఆమూడు

ఆయుధాలు విడిచి పెట్టటమే

విజయ రహాస్యం


ఒకవేళ నీ జీవితంలో ఈ మూడు

ఆయుధాలు ఉంటేగనక

నువ్వు సాతాను ప్రతినిధిగా

సాతాను ఆయుధ ధారునిగా ఉన్నావని

క్రీస్తు నామం లో తెలియ జేస్తున్నాను


(రోమీ 8:4,13)


మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన

యెడల చావవలసినవారై యుందురు

గాని ఆత్మచేత శారీర క్రియలను

చంపినయెడల జీవించెదరు



కాబట్టి శరీర క్రియలు విడిచి పెట్టి

మీ జీవాన్ని యేసు దగ్గర

దాచిపెట్టు కోండి అని ప్రభువు

కోరుతున్నాడు



నేడే రక్షణ దినం

క్రీస్తు విజయాన్ని ఆనందించు

క్రీస్తు రాజ్యంలో చేరు

సాతాను ఆయుధాలను దేవుని ఆత్మతో

ఎదుర్కో!

శరీర, నేత్ర ,జీవపు, ఆశలకు

దూరంగా జీవించి దేవుని నీడలో

రాబోవు ఏదేను

లో ప్రవేశించ నిరీక్షణ గలవారై

ప్రభువు సన్నిధిలో కనిపెట్టు


ప్రభువు మిమ్నును అత్యధికముగా దీవించు గాక

ఆమెన్


Share this post