Skip to Content

దేవునిని ఎవరు సృజించారు? దేవుడు ఎక్కడనుండి నుంచి వచ్చారు?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-who-created-God.html

అన్ని విషయాలకు కారకము ఉండాలి కాబట్టి దేవునికి కూడా కారకముండే ఉండి తీరలి అన్న సామన్య వాదనే హేతువాదులు, సంశయవాదులు లేవనెత్తే సాధరణ వాదన. (ఒకవేళ దేవుడు దేవుడుగా కాకుండాకపోతే ఇక దేవుడేలేడు). దేవుడ్ని ఎవరు చేసారు అన్న సాధారణ ప్రశ్నను కొంచెం కృత్రిమ పద్దతులలో అడగటమే. శూన్యంనుంచి ఏ వస్తువువెలువడదని అందరికి తెలుసు. కాబట్టి ఒకవేళ దేవుడు ఒక “వస్తువు” అయినట్లయితే ఆయనే ఒక కారకమై ఉండి వుండాలి?

ఇది ఒక తప్పుడు అపోహమీద ఆధారపడి ఉన్న చిక్కు ప్రశ్న. ఒకవేళ దేవుడు ఎక్కడోనుంచి వచ్చినట్లయితే ఒక చోటనుంచి వచ్చినట్లు అని అన్నట్లే. అది అర్దరహితమైన ప్రశ్న అన్నదే సరియైన జవాబు. నీలిరంగు వాసన అంటే ఎలా వుంటుంది? అది నీలిరంగును, వాసన కల్గియుండే జాబితాకు చెందినవాడు కాదు. దేవుడు సృజింపబడనివాడు, అకారకము లేనటువంటివాడు, ఆయన ఎప్పుడు ఉనికిలో నున్నవాడు.

అది మనకేలాగు తెలుసు? శూన్యమునుండి ఏది రాదు అని మనకు తెలుసు కాబట్టి ఒకవేళ ఒకప్పుడు సమస్తము శూన్యము అయినట్లయితే శూన్యమునుండి ఏది ఉనికిలోకి వచ్చేదికాదు. అయితే ఇప్పుడు వస్తువులు ఉనికిలోఉన్నాయి. కాబట్టి ఇవి ఉనికిలోనికి రావడానికి ఏదో ఒకటి నిత్యము వుండి వుండాలి. ఆ నిత్యము ఉనికిలో ఉన్నదానినే దేవుడు అని అంటాం. కారకము లేనటువంటివాడే దేవుడు. ఆయనే సమస్తాన్నికి కారకుడు. కారకములేనటునటువంటి దేవుడే, విశ్వాన్ని అందులోనున్న సమస్తాన్నికి కారకుడు.


Share this post