Skip to Content

దేవుని సార్వభౌమత్వము మన స్వచిత్తం రెండు కలిసి రక్షణ కార్యములో ఏ విధంగా పనిచేయును?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-sovereignty-free-will.html

దేవుని సార్వభౌమత్వం, మానవుల స్వచిత్తం వాటి మధ్య సంభంధాన్ని మరియు భాద్యతను పూర్తిగా అవగాహనను చేసికోవటం అసాధ్యం. కేవలం దేవునికి ఒక్కరికి మాత్రమే రక్షణ ప్రణాళిక అది ఏ విధంగా కలిసి పనిచేయునో తెలియును. సుమారు మిగిలిన సిధ్ధాంతాలతో, ఈ సంధర్భంను పోల్చినట్లయితే ఆయనతో కలిగియుండే సంభంధంగురుంచి గాని దేవుని స్వభావమునుగూర్చి గాని మనము పూర్తిగా గ్రహించటానికి మన చేతగానితనంను ఒప్పుకొనవలెను. ఇరుప్రక్కల మనము దూరంగా ఆలోచించుటకు ప్రయత్నించినట్లయితే పూర్తిగా రక్షణనుగూర్చి అవగాహన చెదురుమదురు అవుతుంది.

లేఖానాలు చెప్తున్నాయి దేవునికి తెలుసు ఎవరు రక్షణపొందాలి అని (రోమా 8:29; 1 పేతురు 1:2). ఎఫెసీ 1:4 లో జగత్తు పునాది వేయబడకముందే ఆయన మనలను ఏర్పరచుకొనెను. బైబిలు పలుమార్లు చెప్తుంది విశ్వాసులు ఏర్పరచుకొనబడినవారు (రోమా 8:33; 11:5; ఎఫెసీ 1:11; కొలస్సీయులకు 3:12; 1 థెస్సలోనీయులకు 1:4; 1 పేతురు 1:2; 2:9) మరియు “ఎన్నుకొనబడినవారు” (మత్తయి 24:22, 31; మార్కు 13:20, 27; రోమా 11:7; 1 తిమోతి 5:21; 2 తిమోతి 2:10; తీతుకు 1:1; 1 పేతురు 1:1). విశ్వాసులు ముందుగా నిర్ణయించబడినవారు (రోమా 8:29-30; ఎఫెసీయులకు 1:5, 11), మరియు మీ పిలుపును ఏర్పాటు చేయబడినవారు(రోమా 9:11; 11:28; 2పేతురు 1:10), రక్షణ కొరకే అని స్పష్టముగా తెలుస్తుంది.

లేఖనాలు చెప్తున్నాయి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినందుకు మనము భాధ్యతకలిగియున్నాము - మనము చేయవలసినదంతా యేసునందు విశ్వాసముంచినట్లయితే రక్షింపబడతావు (యోహాను 3:16; రోమా10:9-10). దేవునికి తెలుసు ఎవరైతే రక్షణపొందాలో, మరియు దేవుడు ఎన్నుకున్నాడు ఎవరైతే రక్షణపొందాలో గనుక రక్షింపబడుటకుగాను మనం క్రీస్తును ఎన్నిక చేసుకోవాలి. ఈ మూడు వాస్తవాలు ఏ విధంగా కలిసి పనిచేస్తాయో పరిథులు కలిగిన మానవుడు అర్థం గ్రహించటానికి అసాధ్యమైంది(రోమా 11:33-36). మన భాధ్యత ఏంటంటే ఈ యావత్తు ప్రపంచానికి సువార్తను తీసుకు వెళ్ళటమే (మత్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8). మనము ముందుగా తెలుసుకోవడం, ఎన్నుకోబడటం, నిర్ణయించబడటం అనేవి దేవునికి సంభంధించిన విషయాలను విడచి నీవు నిష్కపటముగా దేవుని సువార్తను ఇతరులకు పంచుతూ విధేయత చూపించవలెను.


Share this post