Skip to Content

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-attributes-God.html

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస్తారేమో. బైబిల్ యొక్క అధికారం లేకుండా, ఈ వాక్యాల యొక్క సంగ్రహం ఒక మనిషి యొక్క అభిప్రాయం కన్నా ఎక్కువ బృహత్తరమైనదేమీ కాదు కనుక, లేఖనాల ఉపప్రమాణాలు సంపూర్ణముగా అవసరం. మనిషి అభిప్రాయం తనంతట తానే దేవుని గురించి అర్థం చేసుకోవడంలో తరచుగా సరికానిది ( యోబు 42:7). మనకి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనదని చెప్పడం ఒక పెద్ద మాట. అలా చేయలేకపోవటం వల్ల మనం ఆయన చిత్తానికి ప్రతికూలంగా, అబద్ధపు దేవుళ్ళను ఆరాధించి, వెంబడించేలా చేయగల సంభవనీయత ఉంది (నిర్గమకాండము 20:3-5).

దేవుడు తనను గురించి వెల్లడించదలచుకున్నది మాత్రమే తెలియబడుతుంది. దేవుని యొక్క గుణాల్లో లేక లక్షణాలలో “వెలుగు” అంటే అర్థం ఆయన తన గురించిన సమాచారమును తానే వెల్లడిపరచుకుంటున్నాడని (యెషయా 60:19), (యాకోబు 1:17). ఆయన యొక్క విశ్రాంతిలో మనలో ఒక్కడైనను ప్రవేశించకుండా, ఆయన తన గురించిన పరిజ్ఞానాన్ని తానే వెల్లడిపరిచేడన్న సత్యం నిర్లక్ష్యపెట్టబడకూడదు ( హెబ్రీయులు 4:1). సృష్టి అయిన బైబిల్ మరియు శరీరధారియైన వాక్యం (యేసుక్రీస్తుదేవుడు ఎటువంటివాడో అని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడతాయి.

దేవుడు మన సృష్టికర్త అనీ మరియు మనం ఆయన సృష్టి యొక్క ఒక భాగం అని అర్హం చేసుకోవడంతో మనం ప్రారంభిద్దాం (ఆదికాండం 1:1 మరియు కీర్తనలు 24:1). మనిషి తన ప్రతిరూపంలో సృజింపబడ్డాడని దేవుడు చెప్పేడు. మనిషి మిగతా సృష్టికి అతీతం మరియు దానిమీద అధికారం మానవునికి ఇవ్వబడింది (ఆదికాండం 1:26-28). సృష్టి పతనంతో దెబ్బతిన్నా కానీ అది ఆయన క్రియ యొక్క ఒక ఈషద్దర్శనాన్ని మనకి ఇస్తుంది ( ఆదికాండము 3:17-18, రోమీయులు 1:19-20). సృష్టి యొక్క విశాలతను, జటిలత్వాన్ని, సౌందర్యాన్ని మరియు క్రమాన్ని చూస్తే భగవంతుని గురించి భయభక్తులు కలుగవచ్చు.

దేవుడు ఎటువంటివాడన్న మన శోధనకి సహాయం చేయడానికి, దేవుని కొన్ని నామములను చదవడం మనకి సహాయపడగలదు. అవి ఇలా ఉన్నాయిః

ఏలోయీము -ధృడమైనవాడు, దివ్యమైనవాడు( ఆదికాండము 1:1).

ఏదోనయి - ప్రభువు, యజమాని మరియు సేవకుని సంబంధాన్ని సూచించేది (నిర్గమకాండము 4:10,13).

ఎల్ ఎల్యోను - సర్వోన్నతుడు, అతి శక్తిమంతుడు

ఎల్ రోయి - చూచుచున్న శక్తిమంతుడు (ఆదికాండము 16:13)

ఎల్ షద్దయి - సర్వశక్తి గల దేవుడు (ఆదికాండము 17:1)

ఎల్ ఓలాము - నిత్య్డమగు దేవుడు (యెషయా 40:28)

యాహ్వే - దేవుడు “నేను ఉన్నవాడను” -అంటే బాహ్యమై ఉండునను దేవుడు (నిర్గమకాండము 3:13-14).

ఇప్పుడు మనం దేవుని మరిన్ని లక్షణాలని పరిశీలించడం కొనసాగిద్దాం: దేవుడు నిత్యమైనవాడు. అంటే అర్థం ఆయనకి ఏ ప్రారంభం లేదు మరియు ఆయన ఉనికి ఎప్పుడు అంతం అవదు ఆయన అమర్త్యుడు, అనంతమైనవాడు ( ద్వితీయోపదేశకాండము 33:27, కీర్తన 90:2, 1 తిమోతి 1:17). దేవుడు నిర్వికారుడు, అంటే అర్థం ఆయన నిర్వ్యత్యాసమైనవాడు; అంటే దేవుడు శుద్ధముగా ఆధారపడతగినవాడు మరియు నమ్మతగినవాడు(మలాకి 3:6 ; సంఖ్యాకాండము 23:19; కీర్తన 102:;26,27). ఆయన సాటిలేనివాడు, అంటే ఎవరూ ఆయనవలె క్రియల్లోకాని లేక ఉనికిలోకాని ఉండలేరని అర్థం; ఆయన అసమానమైనవాడు మరియు పరిపూర్ణుడు ( 2 సమూయేలు 7:22; కీర్తన 86:8, యెషయా 40:25; మత్తయి 5:48); దేవుడు రహస్యస్వరూపుడు, అంటే గూఢమైనవాడు, అననేష్వణీయమైనవాడు. ఆయన జ్ణానమును శోధించుట అసాధ్యము( యెషయా 40:28; కీర్తన 145:3; రోమీయులు 11:33,34).

దేవుడు న్యాయస్థుడు; ఆయన పక్షపాతి కాడు అన్న భావంలో (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 18:30) ఆయన మనుష్యులను లక్ష్యపెట్టేవాడు కాదు. “ఆయన శర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన శక్తిమంతుడు. ” తనకి ఇష్టమున్నదేదైనా ఆయన చేయగలడు, కానీ ఆయన క్రియలెప్పుడూ ఆయన స్వభావం ప్రకారం ఉంటాయి (ప్రకటన 19:6), యిర్మీయా 32:17, 27). ఆయన సర్వవ్యాపకుడు, ప్రతి చోటా ఎప్పుడూ ఉండేవాడని అర్థం; కానీ దేవుడే ప్రతీదీ అని దీని అర్థం కాదు (కీర్తన 139:7-13; యిర్మీయా 23:23). దేవుడు సర్వజ్ఞుడు- అంటే ఆయనకి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలియడమేకాక మనం ఎప్పుడు, ఏమిటి ఆలోచిస్తూ ఉంటామో అని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు కనుక ఆయన న్యాయం కూడా ఎల్లప్పుడూ సబబుగానే నడుస్తుంది (కీర్తన 139:1-5, సామెతలు 5:21).

దేవుడు ఒక్కడే. అంటే, ఇంకెవరూ లేరనే కాక మన హృదయపు అంతరంగాల యొక్క అవసరాలు మరియు వాంఛలని నెరవేర్చేవాడు ఆయన ఒక్కడే మరియు ఆయన ఒక్కడు మాత్రమే మన ఆరాధనకి మరియు నిరత్యతకి యోగ్యుడు(ద్వితీయోపదేశకాండము 6:4). దేవుడు నీతిమంతుడు అంటే దేవుడు తప్పులని క్షమించడు మరియు క్షమించజాలడు. మన పాపాలు ఆయనపైన మోపబడినప్పుడు మన పాపాలు క్షమించబడటానికి ఆయన నీతి మరియు న్యాయం వలన యేసు దేవుని తీర్పుని అనుభవించవలిసి వచ్చింది (నిర్గమకాండము 9:27; మత్తయి 27:45-46; రోమీయులు 3:21-26).

దేవుడు సర్వాధికారి, అంటే ఆయన సర్వశ్రేష్టుడు. తెలిసీ, తెలియకా కూడా, ఆయన సృష్టి సమస్తం కలిపికూడా ఆయన ఉద్దేశ్యాలని అడ్డగించలేదు. (కీర్తన 93:1, యిర్మీయా 23:20). దేవుడు, అంటే ఆయన అగోచరమయేవాడు ( యోహాను 1:18, 4:24). ఆయన త్రిత్వము. అంటే ఆయన ఒకరిలో ముగ్గురు అని- సారములో ఒకటే, శక్తి మరియు మహిమయందు సమానమే అనీ. ప్రధమ లేఖనము ఉదహరించబడినప్పుడు అది, “ తండ్రి, కుమారుడు మరియ పరిశుద్ధాత్మ” అన్న ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వాలని ఉదహరించినప్పటికీ , ఆ “నామము” ఏకవచనంలో ఉంది ( మత్తయి 28:19, మార్కు 1:9-11). దేవుడే సతము, అంటే ఆయన ఉనికికంతా ఆయన ఏకీభావాన్ని కలిగి ఉండి ఆయన అనశ్వరమైనవానిగా ఉండి అబద్ధాలు పలకలేడని అర్థం( కీర్తన 117: 2, 1 సమూయేలు 15:29).

దేవుడు పరిశుద్ధుడు-అంటే ఆయన నైతికంగా, అపవిత్రతనుండి వేరు చేయబడ్డాడని మరియు దానికి విరుద్ధమైనవాడని అర్థం. దేవుడు కీడునంతా చూస్తాడు మరియు అది ఆయనకి కోపాన్ని రప్పిస్తుందిః సామాన్యంగా పవిత్రతతోపాటు లేఖనంలో అగ్ని ఉదహరించబడుతుంది. దేవుడు దహించు అగ్నివలె చెప్పబడతాడు( యెషయా 6:3 ; హబక్కూకు 1:13; నిర్గమకాండము 3:2, 4,5; హెబ్రీయులు 12:29). దేవుడు దయాళువు-దీనిలో ఆయన మంచితనం, కృప, దయ మరియు ప్రేమ చేర్చబడి ఉన్నాయి- అవి ఆయన మంచితనానికి అర్థాల యొక్క లేశాలని అందించే పదాలు. అది కనుక దేవుని మహిమ వల్ల కాకపోతే, ఆయన యొక్క ఇతర లక్షణాలు ఆయన్నుంచి మనలని మినహాయించి పెడతాయి. కృతజ్ఞతాపూర్వకంగా, ఆయనకి మనలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా తెలుసుకునే ఇచ్ఛ ఉంది కనుక సంగతి అది కాదు( నిర్గమకాండము 34:6, కీర్తన 31:19, 1 పేతురు 1:3; యోహాను 3:16; యోహాను 17: 3).

ఒక దేవుని మహత్తైన ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక సాత్వికమైన ప్రయత్నం ఇది. దయచేసి ఆయన్ని శోధించడం కొనసాగించడంలో గొప్పగా ప్రోత్సాహాన్ని పొందండి.

Sajeeva Vahini

Share this post