Skip to Content

దేవుడు ఉన్నాడా ? ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఉందా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-does-God-exist.html

దేవుడు వున్నాడా? ఈ వాదనకి చాలా ఆసక్తి చూపించబడింది. ఇటీవల చేసిన పరిశోధనలను బట్టి ప్రపంచములోని 90 % ప్రజలు దేవుడు ఉన్నాడని లేదా ఒక మహా శక్తి అని నమ్ముతారు. ఏదైతేనేమి దేవుడున్నాడని నమ్ముతున్నా వాళ్లపై ఇది నిజంగా నిరూపించవలసిన భాద్యత ఉంచబడింది. ఇంకొక రకముగా ఆలోచిస్తే చాలా తర్కముగా అనిపిస్తుంది.

ఏమైనప్పటికి, దేవుడున్నాడని నిరూపించలేము అలా అని లేదని చెప్పలేము. బైబిలు చెప్పినట్లుగా విశ్వాసంతో దేవుడున్నాడన్న నిజాన్ని అంగీకరించాలని, “మరియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉ౦డుట అసాధ్యమని, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” (హెబ్రీ 11.6). దేవుడు తలచుకుంటే ఆయన చాలా సూక్ష్మంగా ప్రపంచం అంతటా ప్రత్యక్షమై తాను ఉన్నాడని నిరూపించుకోగలడు. కానీ ఆయన అది చేస్తే, ఇంక విశ్వాసం యొక్క అవసర౦ లేదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అతనితో చెప్పెను (యోహాను 20.29).

ఏమయినప్పటికీ, దేవుడు ఉన్నాడనుటకు సాక్ష్యము లేదని, అర్థ౦ కాదు. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురి౦చుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఙానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మాటలు లేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలమానాలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు వ్యాప్తి చె౦దియున్నవి” (కీర్తనలు 19: 1-4) నక్షత్రములను చూసినపుడు, విశాలమైన ఈ విశ్వాన్ని పరిశీలి౦చినపుడు, ప్రకృతి యొక్క అద్భుతాలను గమనించినపుడు సూర్యాస్తమయ అందాలను చూసినపుడు—ఇవన్నీ సృష్టి కర్త అయిన దేవుని సూచిస్తాయి. ఇవి కూడ చాలవు అనుకుంటే మనందరి హృదయాలలో దేవుడు ఉన్నారన్న సాక్ష్యం ఉ౦ది. ప్రసంగి (3.11) లో చెప్పినట్లుగా, ...“ఆయన శాశ్వత కాల జ్ఙానమును నరుల హృదయములో ఉ౦చి వున్నాడు…”. చాలా లోతుగా గుర్తిస్తే, ఈ జీవితం వెనుక ఏదో వుంది, మరియు ఈ ప్రపంచము వెనుక ఎవరో వున్నారు. మనము ఈ సమాచారాన్ని అర్థ౦ లేదని కొట్టివేసినా కాని, దేవుని సన్నిధి మనతో మరియు మన ద్వారా ఇ౦కా వుంది. ఇంకా దేవుడు లేడని ప్రక్కకి తోసివేసే వారితో (కీర్తన 14.1) లో చెప్పినట్లుగా “దేవుడు లేడని బుధ్ధిహీనులు, తమ హృదయములో అనుకుందురు”. 98 % పైగా ప్రజలు చరిత్ర, సంస్కృతి, నాగరికత, కల అన్ని ఖండాల వారు నమ్మేదేమిటంటే దేవుడువున్నాడని, ఈ నమ్మకము వెనుక ఏదో ఉ౦ది (లేదా ఎవరో ) ఉన్నారని.

బైబిలు వాదనల ప్రకారము దేవుడున్నాడని చూస్తే, తర్కపరమైన వాదనలు ఉన్నాయి. ప్రథమముగా, తర్కవిభేదమైన వాదము కలదు. ఈ తర్క విభేదానికి ముఖ్య అంశం ఏమిటంటే దేవుడున్నాడని నిరూపించటం. “ఆయనను మించిన మరే శక్తి లేదని” నిరూపించటంతో దేవుని గూర్చిన నిర్వచనం మొదలవుతుంది. ఈ వాదన ఎలా వుంటుందంటే ఆయన ఉనికి కన్నా ఇంకొక గొప్ప ఉనికి ఉందంటే అది ఎంత గొప్పదో బయటపడాలి. ఒకవేళ దేవుడు లేనట్లయితే ఆయన ఒక గొప్ప చలించే వ్యక్తి కాకపొతే దేవుని యొక్క ప్రతి నిర్వచనము విరుద్ధమైపోతుంది. రెండవది సరియైన వాదన ఏమిటంటే ఖచ్చితంగా ఈ విశ్వ సృష్టి వెనుక ఒక అద్భుతమైన దైవిక సృష్టి కర్త ఉన్నారని. ఉదాహరణకి భూమి సూర్యుడికి కొన్ని వందల మైళ్ళ దగ్గరగా గాని, లేదా దూరంగా ఉన్నట్లయితే , ప్రస్తుతం ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉ౦డేది కాదు. వాతావరణములో ఉన్న అణువులలో కనుక కొంచెం మార్పు ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయి ఉ౦డేది. 10,243 లో ఒక్క దానికే ప్రోటీన్ కణము అయ్యే అవకాశాలు ఉన్నాయి (2430 నుండి 10 వస్తాయి). ఒక్క కణము కొన్ని మిలియన్ల ప్రోటీన్ కణాలను కలిగి ఉంటుంది.

దేవుని ఉనికిని గూర్చిన మూడవ తర్కవాదన జగత్సంబంధమైన వాదన. ప్రతి పరిణామము వెనుక ఒక కారణము ఉ౦టుంది. ఈ విశ్వము మరియు సమస్తము ఒక ఏర్పాటే. ప్రతీది బయటకు అనగా ఉనికి లోనికి రావటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణము ఉ౦డే ఉ౦టుంది. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే సమస్తము ఉనికి లోనికి రావటానికి ఏదో తెలియని కారణము ఖచ్చితంగా ఉ౦డే ఉ౦టుంది. ఆ “తెలియని కారణమే” దేవుడు. నాల్గవ వాదన నీతి పరమైన వాదన. ప్రతి సంస్కృతి చరిత్ర అంతా ఒక విధమైన ధర్మశాస్త్రము తో ఏర్పాటయింది. ప్రతి మనిషికి మంచి, చెడు విచక్షణ కలవు. హత్య, అసత్యమాడటం, దొంగతనం మరియు అనైతికం వీటన్నిటిని విశ్వమంతా ఎప్పుడో త్రోసివేసింది. మరి పరిశుడైద్ధున దేవుని నుండి కాకపోతే మరి ఈ మంచి చెడు విచక్షణా జ్ఙానము ఎక్కడనుండి వచ్చాయి. వీటన్నిటిని ప్రక్కకు త్రోసివేసి, బైబిలు ఏం చెపుతుందంటే ప్రజలు సృష్టి౦చినవాటిని

మరియు ఉపేక్షించటానికి వీలు లేని దేవుని జ్ఙానమును నమ్మటానికి బదులు అసత్యమును నమ్మరు. రోమా 1:25 లో చెప్పినట్లుగా “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, మరియు సృష్టికర్తకు ప్రతిగా సృష్టి౦చినవాటిని

పూజించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్”. బైబిల్ ఇంకా ఏమని ప్రకటిస్తుందంటే (రోమా 1:20) “ప్రజలు ఏ సాకు లేకుండా దేవుని నమ్మటానికి బదులు—ఆయన అదృశ్య లక్షణములు,నిత్యశక్తియు, దైవత్వమును, స్పష్టముగా చూసి కూడ, ఎలా సృష్టించబడినవో అర్థము చేసుకుని కూడ నమ్మలేకున్నారు”.

ప్రజలు దేవుని యందు నమ్మకము లేదని చెప్పటానికి “శాస్త్రీయమైన” లేదా “సరియైన ఆధారము” లేక కాదు. నిజమైన కారణము ఏమిటంటే ఒకసారి దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నపుడు ఆయన ఇచ్చు అవసరమైన క్షమాపణ కొరకు ఆయన పట్ల బాధ్యులై ఉ౦డవలెనని గుర్తించాలి అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉ౦డాలి. (రోమా 3:23; 6:23). దేవుడు వున్నట్లయితే, మన క్రియల విషయమై మనము లెక్క అప్పచెప్పవలసినవారమై ఉన్నాము. ఒకవేళ దేవుడు లేనట్లయితే తీర్పు వస్తుందన్న చింత లేక మన ఇష్టానుసారంగా మనం చేయవచ్చు. సృష్టికర్తయిన దేవుడిని నమ్మటం అనే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వటానికి –మన సమాజంలో ఈ పరిణామము బలంగా పట్టుకుని వుంది. దేవుడు ఉన్నాడు మరియు ఆఖరికి ప్రతిఒక్కరికి తెలుసు ఆయన ఉన్నాడని. నిజమేమిటంటే కొంతమంది చాలా వాదనలతో కలహించి చివరకి ఆయన ఉన్నారన్న నిజాన్ని నిరూపించలేకపోయారు.

చివరగా దేవుడున్నాడని ఒకే ఒక వాదన వుంది. ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది? క్రైస్తవులుగా మనకి తెలుసు ఆయన ఉన్నాడని, ఎందుకంటే మనం ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతాం కాబట్టి. మనం ఆయన తిరిగి మాట్లాడటం వినకపోవచ్చు, కాని ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం, ఆయన నడిపించే అనుభూతి చెందుతున్నాం, మనకు ఆయన ప్రేమతెలుసు, ఆయన కృపను కోరుకుంటున్నాం. మన జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నా దేవుని కంటే ఎక్కువగా చెప్పటానికి మనదగ్గర ఏ ఇతర వివరణ లేదు. దేవుడు మనలను ఎంతో అద్భుతంగా రక్షించి మరియు మన జీవితాలను మార్చిన దానికి మనం ఆయనను అనుసరిస్తూ, ఆయన ఉనికిని స్తుతించటం తప్ప మనం ఏమి చేయలేము. ఈ వాదనలలో ఏ ఒక్కటీ వారిని కాని ఇతరులను కాని ఇంత స్పష్టముగా ఉన్నదానిని అనుసరి౦చటం ఎవరూ తప్పించలేరు. చివరికి దేవుని ఉనికిని విశ్వాసంతోనే అంగీకరించాలి. (హెబ్రీ 11.6). విశ్వాసం అనేది గుడ్డిగా చీకటిలోకి గంతు వేయటం కాదు, ఎక్కడ అప్పటికే 90 % ప్రజలు నిలబడి బాగా వెలిగించబడి ఉన్న గదిలోకి సురక్షితముగా అడుగుపెట్టటం.


Share this post