- Author: Christian Tracts
- Category: Articles
- Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-God-is-love.html
ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది మరియు దేవుడు ప్రేమై యున్నాడు, కాబట్టి ఆయన ఈ విధంగానే వుంటాడు. ప్రేమ ధీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమునువిచారించుకొనదు;త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరిక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. భాషలైనను నిలిచి పోవును; ఙ్ఞానమైనను నిరర్ధకమగును (1కొరింధి 13:4-8అ).
ప్రేమ (దేవుడు) ఎవరిని బలవంతపెట్టడు. ఎవరైనను తన దగ్గరకు వస్తే అది ప్రేమకు స్పందించినప్పుడే. ప్రేమ (దేవుడు) అందరికి దయ చూపిస్తాడు. ప్రేమ (యేసుక్రీస్తు) నిష్పక్షపాతముగా అందరికి మంచి చేసాడు. ప్రేమ (యేసు) ఇతరులకు చెందిన దానిని ఆశించలేదు. తగ్గింపుజీవితం కలిగి యున్నాడు. ప్రేమ (యేసయ్య) తానేంతో శక్తివంతుడైనప్పటికి తాను గురుంచి డంబముగా చెప్పుకోలేదు. ప్రేమ (దేవుడు) బలవంతంగా విధేయతను కోరడు. పరలోకపు తండ్రి తనకుమారుడునుండి బలవంతంగా విధేయతను కోరలేదు.గాని యేసయ్య తానే ఇష్టపూర్వకంగ విధేయతను చూపించాడు ( యోహాను 14:31). ప్రేమ (యేసయ్య) ఎప్పుడు ఇతరుల కోరికలను తీర్చాడానికి చూశాడు, చూస్తున్నాడు.
దేవుని ప్రేమను గంభీరముగా వ్యక్త పరిచే వచనమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను యోహాను 3:16. రోమా 5:8 అదే వర్తమానాన్నిప్రకటిస్తుంది అయితే దేవుడు మనయెడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు: ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. ఈ వచనములను బట్టి దేవుని యొక్క కోరిక మనము ఆయనతో కలిసి నిత్యత్వమైనటువంటి పరలోకములో వుండాలని ఆశపడ్తున్నాడు. దానికి మార్గము సరాళము చేయుటకుగాను మన పాపములకై వెల చెల్లించాడు. తన చిత్తానుసారముగా మనలను ప్రేమించటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ప్రేమ క్షమియిస్తుంది. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (యోహాను 1:9).
దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి? ప్రేమ దేవుని గుణగణము. దేవుని శీలమునకు ఆయన వ్యక్తిత్వాన్నికి మూలమైనది ప్రేమ. దేవుని ప్రేమ ఏ విధముగానైన తన పవిత్రతను నీతిని న్యాయానికి లేక ఉగ్రతకు విరుద్దమైంది కాదు. దేవుని గుణ గణములన్నియు సమతుల్యముగా వున్నవి. దేవుడు చేసేనదంతాకూడా ప్రేమ పూరితమైంది, న్యాయమైనది, సరియైనది. నిజమైనటువంటి ప్రేమకు ఖచ్చితమైన ఉదాహరణే దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తును ఎందరైతే స్వీకరించారో వారందరికి పరిశుధ్ధాత్మ యొక్క శక్తిని బట్టి ప్రేమించే సామర్ధ్యాన్ని దేవుడు ఆశ్చర్యంగా అనుగ్రహించాడు (యోహాను 1:12; 1 యోహాను 3:1, 23-24).