Skip to Content

దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం

  • Author:
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించుట, ఆయనను ప్రేమించుటకు నిదర్శనం.

ఇచ్చుట అనేది దైవ లక్షణం. సర్వమానవాళి రక్షణార్ధం దేవుడు తన ఏకైక కుమారుడగు క్రీస్తు యేసును పాప పరిహారార్ధబలిగా ఇచ్చి వేసియున్నాడు.. దేవుడు లోకమును ఏంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యెహో 3:16). దేవునికి గల ఈ లక్షణములను మనము కలిగియుండాలనేది ఆయన సంకల్పం.

దేవుని చేత సృష్ఠింపబడిన ఈ సృష్ఠిని నిశితంగా పరిశీలిస్తే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో అద్భుతమైన దేవుడో మనకు అర్ధం అవుతుంది. ఈ ప్రకృతిలో ప్రతీదీ మన కిచ్చుటకే సృష్ఠింపబడినదనేది మనకు తెలియుచున్నది. దేవుని నడిపింపు వలన ప్రకృతి ద్వారా పుచ్చుకుంటున్న మనం “ఇచ్చుట” అనే భాధ్యతగల వారముగా జీవించాలనేది దైవ సంకల్పం.

దేవుని దయ లేనిదే మనం ఎంత కష్టపడినా ఫలితాన్ని సాధించలేము. రైతు పొలాన్ని దున్ని, నీరు పెట్టి, ఎరువు వేసి పంటను పండించినా ఒక్కోసారి పకృతి వైపరిత్యాల వలన పంట సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కారణం దేవుని దయ కాపుదల లేకపోవుటయే. కావున దేవుని దయ మీదే సర్వం ఆధారపడి ఉందని విస్వసిస్తున్నాం. సర్వకాల సర్వావస్థలయందు సమృద్ధియైన పంటనిస్తున్న దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతార్పణలను అర్పించుకోవాలి. ఇదే ప్రతీ క్రైస్తవుని లక్షణం.


Share this post