Skip to Content

దేశమా! కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందు

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: ???? ???? ???????
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

అప్పుడప్పుడూ అనిపిస్తూవుంటుంది మనిషి ఆనందమార్గాలు అన్వేషిస్తూ ఆనందానికి నిర్వచనాన్ని మరచిపోయాడేమోనని. అసలు ఆనందాన్ని వెదకాల్సిన అవసరం ఎప్పుడు మొదలయ్యింది? ఏదైనా పోగొట్టుకుంటే కదా వెదకాల్సిన అవసరం. ఏదో పోగొట్టుకొన్న మనిషి వెదకుతూ వెదకుతూ విబిన్న వైరుద్యాల నడుమ యిరుక్కుపోయాడు. తనను వెతుక్కుంటున్న అనేకానేక అంశాలలో ఆనందం ఒకటి. తనకు తాను నిర్మించుకుంటున్న పరిథుల్ని తానే వుల్లంగిస్తూ, సరికొత్త ద్వారాల్ని తెరచుకుంటూ తాను మొదలయ్యిన మార్గాన్ని మరచిపోతున్నాడు.

ఆనందం శారీరకమా? ఆత్మీయమా? అనే సందేహాలతో సంఘర్షిస్తూనే వున్నాడు.

ఆనందాన్ని గురించిన తలంపు నాలో కల్గినప్పుడు బైబిలులోని ఎజ్రానెహెమ్యాలు గుర్తుకొచ్చారు. భారత స్వాతంత్ర పోరాటాలమధ్య రాజ్యాంగాన్ని క్రోడీకరించుకున్న సందర్భాలు మనసులో మెదిలాయి. రెండూ వేర్వేరు కాలాలలో అయినా రెండు సందర్భాలలో జరిగిన ఒకే అంశం పదే పదే నన్ను అలోచింపచేస్తుంది. ఆది జాతి జీవన ప్రమాణాల ప్రణాళికా పునఃనిర్మాణం. అవును! ఇప్పుడు మనం పునఃనిర్మించుకోవల్సిన వాటిలో ఆనందం ఒకటి.

అంతేకాదు, స్వతంత్ర భారతావనిని నిర్మించడానికి ఆధారమైన విలువలే అఖండ ఘణతంత్ర భారతానికి ఆయువుపట్టై దేశ ప్రజల సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నాయి.

దేశమా! కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతూ.. మన విలువలను మనం కాపాడుకుంటూ.. ఆశతో మన రాజు యేసుకై ఎదురు చూడుము...

యోవేలు 2:21 దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.


Share this post