Skip to Content

బైబిలు విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికొనుట గురించి ఏమంటుంది?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-divorce-remarriage.html

మొదటిదిగా విడాకులకు ఎటువంటి దృక్పధమున్నప్పటికి మలాకీ 2:16 భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఙ్ఞాపకముంచుకోవచ్చు. బైబిలు ప్రకారము వివాహామనేది జీవితకాల ఒప్పాందము. కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. వివాహామనునది పాపులైన ఇద్దరు వ్యక్తులకు మధ్య సంభంధము కాబట్టి విడాకులు జరగటం సాధ్యమని దేవుడు ముందుగానే గుర్తించాడు.కాబట్టి పాత నిబంధనలో విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తులను కాపాడటానికి మరి ముఖ్యంగా స్త్రీలును, దేవుడు కొన్ని చట్టాలను పెట్టాడు, నియమించాడు (ద్వితియోపదేశకాండము 24:1-4). యేసుక్రీస్తు ప్రభువువారు ఈ చట్టాలను గూర్చి మాట్లాడుతూ, మనుష్యులు కాఠిన్యమును బట్టేగాని దేవుని కోరిక కాదు అని సూచించారు (మత్తయి 19:8).

విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికోవటం అనే వివాదాస్పదమైన అంశం యేసుక్రీస్తు ఈ రెండు చోట్ల, మత్తయి 5:32 మరియు 19:9 ప్రస్తావించిన పలుకులు బైబిలులోని యేసుక్రీస్తుమాటలపై ఆధారపడియున్నది. వ్యభిచార కారణమొక్కటే విడాకులు తీసుకోవడానికి, తిరిగి వివాహాము చేసికోవటానికి దేవుడు అనుగ్రహించి అనుమతిస్తున్నట్లు లేఖనములలో అనిపిస్తుంది. కొంతమంది ఈ వ్యభిచార కారణము ప్రధానమునకీయబడిన కాలమునకు మాత్రమే వర్తిస్తుందని భాష్యం చెప్తారు. యూదా సంస్కృతిప్రకారము నిశ్చిత్తార్థము తర్వాత ప్రధానము చేయబడినటువంటి స్త్రీ పురుషులను భార్య భర్తగా ఎంచుతారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమున కీయబడినవారు అవినీతికి పాలపడినట్లయితే విడాకులకు హేతు బద్దమైన కారణంగా పరిగణిస్తారు.

1కొరింథీ 7:15 ఓ అవిశ్వాసి విశ్వాసినుంచి విడాకులు కోరినట్లయితే అది తిరిగి వివాహాము చేసికొనుటకు అనుమతిస్తుందని కొంతమంది అర్థం చెప్తారు. అయితే ఆ వాక్య భాగాలలో తిరిగి వివాహము చేసికొనుట అన్నది లేదు కాని ఓ అవిశ్వాసి తన జీవిత భాగస్వామినుంచి వేరవడానికి ఇష్టపడినట్లయితే విశ్వాసికి నిర్భంధనమే లేదని తెల్పుతుంది. జీవిత భాగస్వామిని లేక పిల్లలను లైంగింకంగా భాధపెట్టినట్లయితే బైబిలులో ప్రస్తావించకపోయిన అది విడాకులకు హేతుబద్దమైన కారణమని కొంతమంది అంటారు. ఇది సరియైనది అని అనిపించపోయినాప్పటికి వాక్యములో ప్రస్తావించలేదు కాబట్టి దాన్ని ఆపాదించుట తప్పు.

వ్యభిచారమునుబట్టి విడాకులు అనుమతించారే కాని అది అవసరమైనది అని కూడా పేర్కొనలేదు అన్న వాస్తావానికి ఈ వాదోపవాదనల మధ్య మర్చిపోకూడదు. వ్యభిచారము తర్వాత కూడా భార్య భర్తలు దేవుని కృపనుబట్టి ఒకరినొకరు క్షమించుకొని వివాహామును తిరిగి కట్టుకోవచ్చు. దేవుడు మనలను ఎన్నో విషయాలలో క్షమించాడు. కాబట్టి దానిని అనుకరిస్తూ వ్యభిచారాపాపాన్ని కూడా క్షమించవచ్చు (ఎఫెసీయులకు 4:32). అయితే కొన్ని సంధర్భాలలో ఈ జారత్వమునకు పాల్పడిన వ్యక్తి పశ్చాత్తాపపడక కొనసాగటం గమనిస్తాం. అటువంటి సంధర్భములో మత్తయి 19:9 ని వర్తింపవచ్చు. మరికొంతమంది విడాకులతర్వాత దేవుడు ఒంటరిగా ఆశిస్తున్నాడని గమనించకుండా మరలా పెళ్ళి చేసుకొంటున్నారు. దేవుడు కొంతమందిని ఏకమనస్సు వుండుటకు వివాహాము చేసుకోకుండా వుండాలని ఆశిస్తారు (1 కొరింథీయులకు 7:32-35). విడాకుల తర్వాత తిరిగి వివాహాము చేసుకొనుట అన్నది కొన్ని సంధార్భాలలో ఒక పద్దతి మాత్రమే. అయితే దాన్ని అర్థం అదే చేయాలని కాదు.

క్రైస్తవులు అని చెప్పుకొనే వారిలో విడాకుల సంఖ్య అవిశ్వాసులతో సమానముగానుండుట అలా విషాదకరం. దేవుడు విడాకులను అసహ్యించుకొంటున్నాడని (మలాకీ 2:16) క్షమించుకోవటం, తిరిగి కలిసి జీవించటం విశ్వాసుల లక్షణమని బైబిలు స్పష్టముగా చేస్తుంది (లూకా 11:4; ఎఫెసీయులకు 4:32). అయితే తన బిడ్డల విషయములో కూడా విడాకులు సధయమే అని గుర్తించాడు. విడాకులు తీసుకొన్న వ్యక్తి విశ్వాసి తనను దేవుడు తక్కువగా ప్రేమిస్తున్నాడని ఎప్పుడూ అనుకోకూడదు. మత్తయి 19:9 లో పేర్కొనబడిన ప్రత్యేకమైన కారణము తనకు వర్తించకపోయినప్పటికి దేవుడు కొన్ని సార్లు క్రైస్తవుల యొక్క అవిధేయతను కూడా గొప్ప కార్యముల కోసమే వాడుకో గలుగుతాడు.


Share this post