Skip to Content

బైబిలు స్వలింగ సంపర్కము విషయమై ఏమి చెప్తుంది? స్వలింగ సంపర్కము పాపమా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-homosexuality-sin.html

స్వలింగ సంపర్కము పాపమని బైబిలు సుస్థిరముగా చెప్తుంది (ఆదికాండము 19:1-13; లేవికాండము 18:22; రోమా 1:26-27; 1 కొరింథీయులకు 6:9). దేవునికి అవిధేయత చూపిస్తూ తృణీకరించినదాన్ని పర్యవసానమే స్వలింగ సంపర్కమని రోమా 1:26-27 భోధిస్తుంది. ప్రజలు పాపములో, అపనమ్మకములో కొనసాగినపుడు “దేవుడు వారిని భ్రష్టమనస్సుకు అప్పగిస్తాడు.” తద్వార దేవునికి దూరమైన నిరర్థకమైన నిరీక్షణలేని జీవితానికి దారితీస్తుంది. స్వలింగ సంపర్కులు “అపరాధులని” దేవుని రాజ్యంను స్వతత్రించుకోలేరని 1 కొరింధి 6:9 ప్రకటిస్తుంది.

దేవుడు ఒక మనిషిని స్వలింగ సంపర్కపు ఆశలతో సృష్టించడు. పాపాన్నిబట్టి స్వలింగ సంపర్కులుగా మారతారని బైబిలు చెప్తుంది (రోమా 1:24-27). మరియు అది వారి ఎంపికే. హింసకు, వీలుపడటానికి ఇతర పాపాలు చేయడానికి కొంతమందికి జన్మతహ అవకశాలు ఎక్కువగా ఎలాగుంటాయో అలాగే మరికొంతమందికి జన్మతహా స్వలింగ సంపర్కులవ్వటానికి ఎక్కువ అవకాశలుంటాయి. అయితే పాపపు ఆశలకు లోబడిపోతూ పాపాన్ని చేయాటానికి ఎంపిక చేయటం విషయంలో మానవులే భాధ్యత స్వీకరించాలి. ఓ వ్యక్తి జీవితంలోని పరిస్థితులు కోపాన్ని/ ఉద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆవిధమైనటువంటి కోరికలు రావటం సమంజసమని అనగలమా? ఖచ్చితముగా కాదు. అదేవిధంగా స్వలింగ సంపర్కము విషయములో కూడా.

ఏదిఏమైనప్పటికి స్వలింగ సంపర్కము యితర పాపములకంటే “పెద్దది” అని బైబిలు చెప్పదు. ప్రతీ పాపము దేవునికి విరుద్దమైనదే. ఒక వ్యక్తిని దేవుని రాజ్యమునుండి దూరపరచే పాపముల పట్టి, 1 కొరింథీయులకు 6:9-10 లో స్వలింగ సంపర్కము ఒకటి అని పేర్కొంటుంది. ఒక దొంగ, హంతకుడు, విగ్రహారాధికుడు, వ్యభిచారికి దేవుని క్షమాపణ ఎంత అందుబాటులో వుందో స్వలింగ సంపర్కపులకు కూడా అంతే. పాపముపై విజయాన్ని సాధించటానికి దేవుడు వాగ్ధానము చేసినటువంటి శక్తి అందరితో పాటు స్వలింగ సంపర్కపులకు కూడా రక్షణవిషయమై క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి లభ్యమౌతుంది (1 కొరింథీయులకు 6:11; 2 కొరింథీయులకు 5:17; మరియు ఫిలిప్పీ 4:13).


Share this post