Skip to Content

బైబిలు డినోసరస్సులు గురించి ఏమిచెప్తుంది? బైబిలులో డినోసరస్సులున్నాయా?

17 July 2024 by
Sajeeva Vahini
  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-dinosaurs-Bible.html

డినోసరస్సులు గురించి బైబిలులో నున్న వివాదము, మరియు ఇతర వివాదములు, క్రైస్తవులు చర్చించుకొనే భూమి వయస్సు ఎంత? ఆదికాండమునకు సరియైన భాష్యం ఏంటి? మన చుట్టూ వున్న భౌతిక నిదర్శానాలకు సరియైన భాష్యం ఏంటి? అనునటి వంటి విభేధాలతో ముడుపడివున్నదే బైబిలులోని డినోసరస్ అనే అంశం.భూమి యొక్క వయస్సు ఎక్కువ అనే ఆలోచించేటటు వంటి వారు బైబిలులో డినోసరస్సులు లేవని నమ్ముతారు. ఎందుకంటే వారి ఆలోచన ప్రకారము తొలి మానవుడు భూమీమీద అడుగుపెట్టడానికి వేల సంవత్సరాలకు ముందే డినోసరస్సులు చనిపోయినవని అనుకుంటారు. బైబిలు రచించిన వారిలో ఎవరు కూడా డినోసరస్సులను సజీవంగా చూడలేదు అనుకుంటారు.

భూమి వయస్సు తక్కువగా ఆలోచించే వాళ్ళు బైబిలులో “డినోసరస్” అనే పదాన్ని ఉపయోగించకపోయిన దాన్ని గురించి ప్రస్తావించారని నమ్ముతారు. అయితే హీబ్రూ పదము టాన్నిన్అన్నా పదాన్ని పలురకాలయిన అర్థాలు యుపయోగించారు. కొన్ని సార్లు మాహా సర్పమని సముద్ర మృగమని అని తర్జుమా చేసారు. టాన్నిన్ అనేది బహుశా అది ఒక పెద్ద ప్రాకెడి జంతువు (జైంట్ రెప్టైల్)భూమి మీద నీటిలోను జీవించే ఈ జీవులు గురించి పాత నిబంధనలో కనీసం 30 సార్లు ప్రస్తావించారు.

ఈ జంతువు గురించి ప్రస్తావించటంతో పాటు బైబిలు దానిని వివరించే పద్దతిని బట్టి కొంతమంది పండితులు దానిని డినోసరస్ అంటారు. దేవుని సృష్టి అంతటిలో నీటి గుఱ్ఱము (యోబు 40:15- బహెమాత్)అతి పెద్దది అని దాని తోకను దేవదారు చెట్టుతో పోల్చారు. బహెమాత్ అనే జంతువును కొంతమంది పండితులు నీటి గుఱ్ఱమును, ఏనుగుతోను పోలుస్తాము. మరికొంతమంది ఈ రెండు జంతువుల తోక సన్నముగా వుంది కాబట్టి దేవదారు వృక్షము వంటిది కాదని అని అంటారు. డినొసరస్, బ్రాఖీయోసరస్ మరియు డిప్లొడాకస్, ఈ రెండు జంతువుల సిదారు వృక్షమువంటి పెద్దతోక కలిగినటువంటి జంతువులు. పురాతనమైన ప్రతీ నాగరికతలో కూడా ఈ రాకసి బల్లుల చిత్రపటాలు వున్నాయి. ఉత్తర అమెరికాలో దొరికిన పెట్రొగ్లిఫ్ఫ్లు, రాతి ప్రతిమలు డినోసరస్ వలె నున్నవి. దక్షిణ అమెరికాలో (కనుగొన్న రాతి మీద చెక్కుడు) మనుష్యులు సవారిచేస్తున్న డిప్లోడాకస్ లాంటి జంతువులు రెక్కలు కలిగిన ట్రిసిరాటాప్స్ లాంటి, ప్టెరొడక్టైల్ లాంటి, మరియు టిరన్నోసరస్ లంటి జంతువులు యొక్క రాతి మీద చెక్కుడు బొమ్మలు డినోసరస్ను పోలియున్నది. రోమీయుల పాల రాతి ప్రతిమలు, మాయిన్ మట్టికుండలు, బబులోను పట్టణగోడలలోవున్న బొమ్మలు, సంస్కృతులకు అతీతముగా, విశ్వవ్యాప్తముగా ఈ జంతువుల గురించి వున్న మక్కువ అర్థం అవుతుంది. మార్కోపోలో రాసిన ఇల్ మిల్లియోనె అనే పుస్తకములో వున్న కధానాలలో ఈ జంతువు ప్రస్ఫుటము అవుతుంది. భౌగోళిక, చారిత్రక ఋజువులతో పాటు శిలాజాలు దక్షిణ అమెరికా ఉత్తర మధ్య ఆసియా ప్రాంతాలలో మనుష్యుల యొక్క డినోసరస్ యొక్క పాదముద్రల యొక్క శిలాజాలు బట్టి మనుష్యులు జంతువులు కలిసి జీవించారని అర్థం.

అయితే బైబిలు డినోసరస్ గురించి రాసారా? డినోసరస్లు ఉన్నయా? దీనిని అంగీకరించటానికి వున్న ఋజువులకు భాష్యంచెప్పటం ద్వారా చుట్టూనున్న ప్రపంచంపైన ఆధారపడియుంది. బైబిలుకు యధాతధంగా భాష్యంచేప్తే భూమి వయస్సు తక్కువని మానవుడు డినోసరస్ కలిసి జీవించారని అంగీకరించాలి. ఒకవేళ మానవుడు డినోసరస్ కలిసి జీవించినట్లయితే డినోసరస్సులు ఏమయినాయి? బైబిలు దీని గురించి ఈ విషయంపై చర్చించదు. బహుశా మహా ప్రళయము తర్వాత పర్యావరకమార్పులనుబట్టి మరియు నిరంతరము వీటిని హతము చేయాలని మానవుల ప్రయత్నాలను బట్టి డినోసరస్ అంతమైపోయినవి.


Share this post