- Author: Monica Hans
- Category: Articles
- Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5
Authority: యెషయా 58:13,14 నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినయెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల నీవు యెహోవాయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలములమీద నేను నిన్నెక్కిం చెదను.
Beauty: కీర్తన 96:6 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి. I తిమో 2:10 దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.
Charity : హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి మత్తయి 6:3 నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమ చేతికి తెలియక యుండవలెను.
Duty:ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము. తీతు 3:1 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెను.
Iతిమో 2:1-3 మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకునిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజుల కొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.
Equality: యోబు 13:10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. సామె 28:21 పక్షపాతము చూపుట మంచిది కాదు, రోమ 2:11 దేవునికి పక్షపాతము లేదు.
Fraternity: కీర్తన 1:1,2 దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 141:4 పాపము చేయువారితో కూడ నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
Generosity: Iతిమో 6:19 రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్ క్రియలు అను ధనముగలవారును, ఔదార్యముగలవారును, (తమ ధనములో) ఇతరులకు పాలివారునై యుండవలెనని వారికి ఆజ్ఞాపించుము. గలతి 6:9 మనము మేలుచేయుటయందు విసుకక యుందుము. మనము అలయక మేలుచేసితిమేని తగినకాలమందు పంట కోతుము.
Hospitality: I పేతురు 4:9 సణుగుకొనకుండ ఒకనియెడల ఒకడు ఆతిథ్యము చేయుడి. హెబ్రీ 13:1 ఆతిథ్యము చేయ మరవకుడి; కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. రోమ 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, ఆతిధ్యము శ్రద్ధగా ఇచ్చుచుండుడి. Integrity: సామె2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును యుక్తమార్గము తప్పక నడుచుకొనువారికి ఆయన కేడెముగా నున్నాడు.
సామె 20:7 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామె 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిం చును.
Justice: కీర్తన 106:3 న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు కీర్తన 82:3 పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి. సామె 21:3 నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
Knowledge: సామె 9:10 యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామె 24:5 జ్ఞానముగలవాడు బలవంతుడుగా నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. సామె 22:12 యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును
Loyalty: సామె 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును
Merit: ద్వితి 28:14 నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.
Neighbourliness: గలతి5:14 ధర్మశాస్త్రమంతయు-నీవలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది I కొరిం 10:24 ఎవడును తనకొరకే కాదు ఎదుటివానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.
సామె 27:10 నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచి పెట్టకుము నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి వెళ్లకుము దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి
Prosperity: సామె 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు. సామె 10:4 బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. కీర్తన118:25 యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
Quality: కొల 3:12,14 కాగా దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్ధలును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటిన్నిటిపైని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఎఫె 5:3 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. I తిమో 4:11 మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
Regularity: కీర్తన 145:2 అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను. లూక 18:1 విసుకక నిత్యము ప్రార్థనచేయవలెను కీర్తన 37:27 కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు
Safety: కీర్తన 12:5 రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సామె 11:14 ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.
Tranquility: రోమ 12:18 శక్యమైతే సమస్త మనుష్యులతో మీ చేతనైనంతమట్టుకు సమాధానముగా ఉండుట. II థెస్స 3:16 సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతివిధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. కొల 3:15 క్రీస్తు (అనుగ్రహించు) సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి;
Unity: కీర్తన 133:1-3 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.