Skip to Content

అడుగుజాడలు

5 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sreekanth Kola
  • Category: Articles
  • Reference: Best of Collections

ఒకరోజు ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఆడుకొంటూ అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. కొంతసేపటికి దారి తప్పి ఇద్దరూ విడిపోయారు. అన్న ఒకచోట, చెల్లెలు ఒకచోట ఏడుస్తూవున్నారు. చివరకు చెల్లెలికి వాళ్ళ ఇంటిని గుర్తుపట్టగలిగే చిన్న దీపం కనబడింది. చెల్లెలికి దారి తెలిసిపోయింది. కానీ అన్నను వదిలిపెట్టి ఎలా వెళ్ళేది ? మా అన్నయ్య ఎక్కడా కనిపించలేదే అని వెదకనారంభించెను గాని, ఇంకా వెదికితే నేను కూడా దారి తప్పిపోతానేమోనని భయపడెను. కాబట్టి తన మెడలో వున్న ఎర్రని పూసలదండలోని ఎర్ర పూసలను ఒక్కొక్కటిగా దారిలో వేసుకొంటూ ఇంటికి చేరుకోనెను.

అన్నవెదకుచూ వెదకుచూ అకస్మాత్తుగా ఒక ఎర్రటి పూసను చూచెను. అరే ఇది మా చెల్లెలి మెడలో ఉన్న పూసల దండలోనిదే అనుకొనుచూ ఇంకా ముందుకు వెళ్ళగా ఇంకొకటి కనిపించెను.. ఆలాగు ఆ పూసలను ఎరుకొంటూ అడుగు వేసుకొంటూ వెళ్ళగా చివరకు క్షేమముగా ఇంటికి చేరెను.

నేనే మార్గమని యేసు చెప్పెను. దేవుని మార్గము తప్పిపోయి ఈ పాపపు అరణ్యములో తిరుగుచున్న మనకు క్రీస్తు మార్గముగా వున్నాడు. ఆయన అడుగు జాడలలో నడిచినయెడల మనం క్షేమముగా మన తండ్రి ఇంటికి (గమ్యం) చేరుకుంటాం. కావున మన కష్టములలోను, శోధనలలోనూ క్రీస్తు వదిలివెళ్ళిన అడుగు జాడలలో నడచినయెడల మన జీవితము యొక్క అంతము సంతోషము, జయము, ఆనందము. మనకిష్టం వచ్చిన దారిలో అటూ యిటూ తిరిగినఎడల దేవుని కనుగొనుటకు బదులు దేవునికి దూరమై నశించెదము.

మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. (యెషయా Isaiah 53:6) అని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఆయన మనకొరకు తన అడుగుజాడలను వదలి వెళ్ళెను.

క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

(1 పేతురు Peter 2:21)

మనం క్రీస్తుని అడుగుజాడలలో నడుచుచున్నామా...?


Share this post