- Author: Unknown
- Category: Articles
- Reference: General
1. ఒకప్పుడు ప్రార్థన వీరులుగా, విజ్ఞాపన చేసేవారు. ఇప్పుడు 15ని!! మించి ప్రార్థన చేయలేకపోవడం, దేవుని తో సమయాన్ని గడపడం ఎంతో కష్టంగా, భారంగా, ఇబ్బందిగా ఉంటుంది.
2. ఒకప్పుడు దేవుని గురించిన విషయాలు, ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు లోక సంబంధమైన విషయాలలో, సినిమా, సిరియల్స్, ఆస్తి పాస్తులు, ఈ లోకంలో భవిష్యత్తు సంబంధించిన మొ!! విషయాలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం.
3. ఒకప్పుడు దేవుని వాక్యం చదివటంలో, ఉపవాసం ప్రార్థనలు చేయటంలో, సంఘం యొక్క పనుల్లో భాధ్యత వహించడం మొదలైన వాటిలో ముందు ఉన్నవారు, ఇప్పుడు మొబైల్ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం, ఉద్యోగ సంబంధమైన విషయాలకే ఎక్కువగా సమయాన్ని కేటాయించడం, ఏదో అప్పుడప్పుడు మాత్రమే అనగా క్రిస్ట్ మస్ట్ కి, గుడ్ ఫ్రైడే లాంటి సందర్భాల్లో భక్తిగా నటించడం
4. స్త్రీలు ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకోకపోవడం, పెద్దలు, పిల్లలు శరీరం ఇతరులకు కనబడే విధంగా(వ్యభిచారివలే) వస్త్రాలు వేసుకోవడం (టైట్ గా ఉన్న వస్త్రాలు, పురుషుడు వేసుకొనే ప్యాంట్లు, షర్ట్స్, స్లీవ్ లెస్ టాప్స్ వేసుకోవడం), అస్తమానం లిపిస్టిక్స్, మేకప్, గోళ్ళు పెంచుకుంటూ వాటిని అందంగా రంగులతో అలంకరించటం, వ్యర్థమైన హేర్ స్టైల్స్ వంటి వాటి పై బహు శ్రద్ధ చూపించడం. ఇవన్నీ కూడా ఆత్మీయంగా పతనమైన, పతనమైనుతున్నారడానికి లక్షణాలు. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి మనలో ఉన్న, ప్రార్థన చేయండి పశ్చాత్తాపపడండి, పద్దతి మార్చుకొండి, పరలోక ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మనలందరిని ఆశీర్వదించును గాక! ఆమీన్.
5. ఇప్పుడు వారు కేవలం దేవుని యొక్క ప్రేమ, కృప, ఆశీర్వాదం, స్వస్థత ల గురించి మాత్రమే వినడానికి ఇష్టపడుతున్నారు తప్ప, దేవుని యొక్క న్యాయతీర్పు, పరిశుద్దత, ఫలించుట మరియు పరలోకం, నరకం గురించి వినడానికి అస్సలు ఇష్టం లేకపోవడం.