Skip to Content

ఆరోగ్య సూత్రములు

5 July 2024 by
Sajeeva Vahini
  • Author: Monica Hans
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5

ఎవరికైన ఆరోగ్యముగా జీవించాలి అంటే బైబిలులోనె మీకు సమాధానం దొరుకుతుంది. పాపమునకు దూరముగా ఉండాలి, ప్రవర్తనలో దైవికముగా జీవించాలి, నాలుకపై అధికారము వహించాలి మరియు వాక్యము ధ్యానించి దాని ప్రకారం జీవించాలి. అవసరమైన వ్యాయామము కూడా కలిగి యున్నట్లయితే వాక్యము ధ్యానించడానికి శ్రద్ధ, శరీరంలో సత్తువ కలిగి పరిశుద్ధమైన ఆలోచనలు పొందగలుగుతాము. మరి బైబులు ఏమి సెలవిస్తుంది?

సామె 3:7,8 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము .అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.

రోమా 6:23 ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

రోమా 8:13 మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు

1 కోరింథీ 11:30,31 ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.

సామె 16:24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.

సామె 12:18 కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.

సామె 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము. దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.

సామె 17:22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.

యెషయా 40:31 యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు

తిమోతి 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.

ప్రియ చదువరీ, పై తెలుపబడినవన్ని దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసినప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది. మంచి ఆరోగ్యం ఉండడం శ్రేయస్కరం అనారోగ్యం చివరికి మరణానికి దారితీస్తుంది. నిర్గమకాండము 15:26 మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.


Share this post