Skip to Content

ఆదరించు మాటలు

18 July 2024 by
Sajeeva Vahini
  • Author: Unknown
  • Category: Articles
  • Reference: General

నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము.

కీర్తనలు 42:5

"నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? .......దేవునియందు నిరీక్షణ యుంచుము"

ఈమాటలు *ఎవరు చెప్పగలరు?

ఒక విశ్వాసి చెప్పగలడు.


*ఎప్పుడు చెప్పగలరు?

విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే.


* విశ్వాసంలో అత్యున్నతమైన స్థాయి ఏమిటి?

ఈ ప్రపంచంలో నేను, దేవుడు ఇద్దరం మాత్రమే ఉన్నాము. ఇంకెవ్వరులేరు అనుకున్నప్పుడు, పూర్తిగా ఆయనపైనే ఆధారపడే స్టితి.

అందుకే కీర్తనాకారుడు ఇట్లా చెప్పగలుగుతున్నాడు. తన బాధలు చెప్పుకోవడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. అందుకే తనే తన ప్రాణంతో చెప్పుకొంటున్నాడు.


*ఒంటరితనమా?

*సమస్యల సుడిగుండమా?

*చెలరేగే తుఫానా?

*ఆప్తులంతా దూరమైనపరిస్థితా?

*ఆధ్యాత్మిక, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక సమస్యలా?

*శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములా?

సమాధానం లేదనుకొంటున్న ప్రశ్నలా?

పరిష్కారం లేదనుకొంటున్న సమస్యలా?

*గమ్యం తెలియని పయనమా?


అయితే, నీ ప్రతీ పరిస్టితికి పరిష్కారం.

1. నీలో నీవు తొందర పడొద్దు. బస్సులో ప్రయాణం చేస్తున్న నీవు ప్రమాదం ముందుందని నీలోనీవు కంగారుపడితే ఏమి ప్రయోజనం? ఆ బస్సు నడిపేది నీవు కాదుకదా? బస్సు....డ్రైవర్ చేతిలో వుంది. అట్లానే, నీ సమస్యల్లో నీవు కంగారు పడినా ఏమి ప్రయోజనం? నీ జీవితం యేసయ్య చేతిలో వున్నప్పుడు. ఆయనే ప్రతీ పరిస్టితి గుండా నడిపిస్తూ గమ్యం చేర్చుతాడు.

2.దేవుని యందు నిరీక్షించు: ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసావేమో? ఇక ఇది నా జీవితంలో సాధ్యం కాదని. నీకు కాకపోవచ్చు. కాని, నీ దేవునికి సమస్తము సాధ్యమే.

అబ్రహాము "నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను." రోమా 4:18 ( ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు.) నీవు నిరీక్షించగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు.

3.శ్రమలలో దేవుని స్తుతించు: నీ సమస్యలు ఎంత ఎక్కువగా వుంటే అంత ఎక్కువగా దేవుని స్తుతించు. ఆ స్తుతుల మధ్య సాతాను నిలువలేక పారిపోతాడు. సమస్యల సృష్టికర్త సాతాను పారిపోతుంటే, నీ సమస్యలన్నీ వాడి వెంటే పరుగులు తీస్తాయి. ఇక శాంతి, సమాధానమే నీ దగ్గర మిగులుతుంది.

ప్రయత్నించి చూడు!

విజయం నీదే!

ఆమెన్!


Share this post