- Author: Harsha Samrat
- Category: Messages
- Reference: Sajeeva Vahini Vol 2 Issue 2
ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన(యేసు) వారితట్టు తిరిగి వారిని గద్దించెను (లూకా 9:55). అంతటి దుడుకు స్వభావము గలవారు యేసుని శిష్యులలోని సహోదురులైన యోహాను మరియు యాకోబు. వీరిద్దరికి ఆయన బొయనేర్గెసను పెరుపెట్టేను; బొయనేర్గెసు అనగా ఉరిమెడు వారని అర్థము. జెబెదయి కుమారుడు, యోహాను సహోదురుడైన యాకోబు గురించి ఈ దినము తెలుసుకుందాము.
యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చిబోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నాము – నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున కూర్చుండునట్లు మాకు దయ చేయమని అడిగిరి. నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నావశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరకునని యేసు వారితో చెప్పెను. యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను, మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి దాసుడై యుండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. వారు ఈ విధముగా యేసుని అడిగి మనుష్య కుమారుడు భూమి మీదకు యే కార్యము కొరకు వచ్చెనో ఆయన ద్వారానే తెలియచేసేను. మరి ప్రియ దేవుని బిడ్డలారా మన ఆలోచనలు ఏ విధముగా వున్నవి ఈ సమాజములో గోప్పవారము ప్రముఖులముగా వుండవలెననా? లేక నిత్యము యేసునికి పరిచారము చేయిచు ఆయన దాసులుగా వుండవలెననా? యేసుని శిష్యులలో దేవునికి సమీపముగా ఉన్న శిష్యుడుగా కొన్ని సంగటనలుబట్టి మనము యాకోబును చూడవచ్చు – యేసు పేతురును యాకోబును అతని సహోదురుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను (మత్తయి 17:1). యేసు – నేను ప్రార్ధనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగు ఆరంభించెను (మార్కు 14:32- 33).
దాదాపు యేసుక్రీస్తు మరణించిన 11 సంవత్సరముల తర్వాత సుమారు AD 44 కాలమందు పులియని రొట్టెల పండుగ దినములలో రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను. ఆ దినములలో యాకోబు మరణము యూదులకు ఇష్టమైన కార్యమైనది అని దేవుని వాక్యము చెప్పుచున్నది అనగా యూదులు యేసును అయన మనకొరకు చేసిన కార్యములను మరిచితిరా? ఆయన శిష్యులను వారి భోదనలను మరిచితిరా? మరి ఈ దినములలో మనము ఏ విధముగా యున్నాము యేసు పరిచారకులను వారు తెలియచేయు దేవుని వాక్యమును మనము ఏ రీతిగా లక్ష్యపెటుచున్నాము?. ఇట్టి ప్రశ్న వేసుకొనడమే కాక మనము దాని యొక్క జవాబుతో జీవితమును సరిచేసుకొని, దేవుని కొరకు జీవించ ప్రయత్నిద్దాము.
యేసుని శిష్యులలో కేవలము యాకోబు మరణమును గూర్చి మాత్రమే పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినది.