- Author: N H Pramila Rani
- Category: Messages
- Reference: Sajeeva Vahini Vol 2 Issue 2
నేడు రక్షకుడు నా కొరకు పుట్టియున్నాడు(లూక 2:11)
యేసు క్రీస్తు ఈ రక్షణను మనకు ఎందుకు కలుగ చేసెను?
లూక 1:75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
నా రక్షకుడు నాకు రక్షణ శృంగము గాను, రక్షణాధారము గాను, రక్షణకర్త గాను,రక్షణాశ్రయదుర్గముగాను ఉన్నారు.
a) రక్షణ శృంగము(Horn of my salvation):
కీర్తన 18:2 యెహోవా నా రక్షణ శృంగము.
ఈ రక్షకుడు మనకు రక్షణ శృంగము ఉండి మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేయును (లూక 1:68)
b) రక్షణాధారము (God is my Salvation)
కీర్తన 62:6 ఆయనే నా రక్షణాధారము నేను కదలింపబడను.
ఈ రక్షకుడు ఆపత్కాలమున మనకు రక్షణాధారముగా ఉండును( యెషయ 33:2)
c) రక్షణకర్త (God of our salvation)
ఈ రక్షకుడు మనకు రక్షణ కర్తగా ఉండి మన పాపములను పరిహరించును
కీర్తన 79:9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
d) రక్షణాశ్రయదుర్గము (Rock of my salvation)
ఈ రక్షకుడు మనకు రక్షణాశ్రయదుర్గముగా ఉండి మన నిమిత్తము ప్రతిదండన చేయును
2 సమూ 22:47,48 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
1. నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు
2. నా నిమిత్తము పగ తీర్చు దేవుడు
3. జనములను నాకు లోపరచువాడు ఆయనే
రక్షణ సమాచారము(Proclaims salvation)
మనకు రక్షణ శృంగము గాను , రక్షణాధారము గాను, రక్షణకర్త గాను,రక్షణాశ్రయదుర్గముగాను ఉన్న రక్షకుని గూర్చిన సమాచారము అనేకులకు ప్రచురింప బద్దులమై ఉన్నాము
యెషయ 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.
రక్షణ పాత్ర(cup of salvation):
కీర్తన 116:12,13 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
రక్షణ: ఇంత గొప్ప రక్షణ పొందుటెట్లు?
1. హృదయమందు విశ్వసించినయెడల రక్షింపబడుదువు
రోమ 10:9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు
2. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము.
రోమ 10:10 ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
3. ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయు వాడు రక్షింపబడును రోమ 10:13 ఎందుకనగా ప్రభువు నామముబట్టి ప్రార్ధనచేయువాడెవడో వాడు రక్షింపబడును.
మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును కలుగజేసిన ఈ రక్షణను బట్టి మనము నిత్యము స్తుతించవలసిన వారమైయున్నాము.