- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము (హెబ్రీ 3:13-15)
మన చివరి అడుగే గెలుపు సాధిస్తుంది. యాత్రికుని ప్రయాణంలో ఆకాశ పట్టణం సమీపంలో ఉన్నన్ని ఆపదలు మిగతా ప్రయాణంలో ఎక్కడా లేవు. అనుమానపు కోట ఉన్నది ఆ సమీపంలోనే. ప్రయాణికుడిని నిద్రపుచ్చి సంహరించే దుష్టశక్తులున్నవి ఆ పొలిమేరల్లోనే. పరలోకపు వైభవం ప్రత్యక్షమైనప్పుడే నరక ద్వారాలు తప్పించుకోలేని శక్తితో, మనల్ని ఆకర్షిస్తుంటాయి. సత్కార్యాలు చెయ్యడంలో మనం అలసిపోకుండా ఉందాం. విరామం లేకుండా పనిచేస్తే త్వరలో మన పంట కోసుకుంటాము. కాబట్టి నీ బహుమతి కోసం పరుగెత్తు.
చింతల కెరటాలు ఎగసి అటూ ఇటూ కొడుతుంటే
శంకల తీరాలనుండి పెనుగాలులు అల్లాడిస్తుంటే
విశ్వాసపు లంగరులు ప్రవాహంలో తేలిపోతుంటే
స్థిరమైనదానికే నేను అంటి పెట్టుకుని ఉన్నాను
దయ్యాలు ఎంతగా పోరాడినా దేవదూతలు ఎంత సేపు దాక్కున్నా
ఈ విశ్వం న్యాయం పక్షమే చుక్కల వెనక ఎక్కడో
ఒక ప్రేమ నాకోసం కాచుకొని ఉంది
ఉదయమైనప్పుడు చూడగలనా స్వరూపాన్ని
చివరి అర్ధగంటదాకా నిలిచి ఉంటేనే దేవునినుండి గొప్ప దీవెనలను పొందగలం.