Skip to Content

Day 51 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీకు అసాధ్యమైనది ఏదియునుండదు (మత్తయి 17:21).


దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఇష్టపడేవాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే.దిన దినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి, శాంతిని పొందగలగడం సాధ్యమే. మన మనస్సులోని ఆలోచనలను, అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడమన్నది తేలికే. ప్రతిదానిలోనూ దేవుని చిత్తాన్ని చూడడం, దానికి నిట్టూర్పుతో కాక సంగీతాలతో తలవంచడం సాధ్యమే.


దైవశక్తిని ఆశ్రయించి అంతరంగంలో బలపడడం సాధ్యమే. గతంలో మనకి బలహీనతలను కలిగించిన విషయాలనూ, పరిశుద్ధతతో, తగ్గింపు స్వభావంతో ఉందామన్న మన పట్టుదలను వమ్ముచేసిన విషయాలను గుర్తించాలి. మనల్ని ప్రేమించి మనలో తన చిత్రానికి లోబడే మనస్సుని పుట్టించి, తన శక్తిని మనలో నాటిన దేవుని ద్వారా పాపానికి మన మీద అధికారం లేకుండా చేసుకోవచ్చు.


ఇవన్నీ దైవసంబంధంగా జరగవలసినవి. ఎందుకంటే ఇవన్నీ దేవుని పనులు. వీటిని మనం నిజంగా అనుభవిస్తే ఆయన పాదాల దగ్గర మోకరించి ఇంకా ఇంకా ఇలాటి విషయాలను గురించి తృష్టగొంటాము.


ప్రతిదినం, ప్రతిగంట, ప్రతిక్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవడం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము.


మనకిష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు. తన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు. మనకిష్టం వచ్చినంత తీసుకోమన్నాడు. ఏదైనా బ్యాంకు ఇనప్పెట్టె తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రం తీసుకుని బయటికి వచ్చేస్తే అతను పేదవాడైనందున ఎవరిది తప్పు? దేవుని ఉచిత వరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉంటున్నాయంటే ఎవరిది ఆ తప్పు?


Share this post