Skip to Content

Day 363 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

. . . ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి ... దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్ధములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి (న్యాయాధి 18:9,10).


లేవండి! మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరచుకుంటే తప్ప ఏదీ మన స్వంతం కాదు. "అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి" (యెహోషువ 16:4). "యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు" (ఓబద్యా 17). నీతిమంతులు శ్రేష్ఠమైన వాటిని స్వాస్థ్యముగా పొందుదురు.


దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే "ఒక పెన్సిలు తీసుకుని "నావి", "నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్ లైన్ చెయ్యడమే" అని జవాబిచ్చాడు.


దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకుని "ఇది నా కోసమే" అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి "ఇది నాది" అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాలపట్ల "ఇది జరిగింది" అని నువ్వు అనగలవు. "ఇది నాపట్ల నిజమైంది" అని చెప్పగలవు.


“కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే" నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు.


విశ్వాసం మార్కెట్ కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది.

Share this post