- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4).
హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట
చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి
పూలు వికసిస్తున్నాయి
పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట
కోటి గొంతులు శ్రుతి కలవాలని చూడకు
వినిపిస్తున్నది ఒంటరి పాటే
తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది
ఒంటరి కోయిల కంఠస్వరమే.
మంచు పట్టిన చలి పొద్దులో
మబ్బుల్నీ చలిగాలినీ చీల్చుకుంటూ
చీకటి కడుపులో చిరుదివ్వె వెలిగిస్తూ
హాయిగా బిగ్గరగా పాట పాడు.
నీ పాట దేవుడికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకి వంగి అతి జాగ్రత్తగా దాన్ని ఆలకిస్తాడు. తలాడిస్తూ "ప్రియ కుమారా పాడు, నేను ఆలకిస్తున్నాను. నిన్ను విడిపించడానికి వచ్చాను. నీ భారం నామీద వేసుకుంటాను. నామీద ఆనుకో, నీ దారీ తేలికౌతుంది. నేను దాన్ని సరిచేస్తాను" అంటాడు.