Skip to Content

Day 345 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా. . . భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి

నిన్ను ఆశీర్వదించును గాక (కీర్తన 134).


ఆరాధించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకలేదా అని మీరనవచ్చు. రాత్రివేళలో దేవుని మందిరంలో నిలబుతున్నారట. ఆవేదన చీకటిలో ప్రభుపుని స్తోత్రించడం, అవును, అందులోనే దీవెన ఉంది. ఇదే విశ్వాసానికి సరియైన పరీక్ష. నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం. దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే. వాతావరణం నిర్మలంగా ఉన్నవేళ, చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్నవేళ, గాలంతా ఆనందగానాలతో నిండి ఉన్నవేళ దేవుణ్ణి పూజించడం తేలికే. చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్తుతించగలదా? రాత్రివేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా? ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా? గెత్సెమనే తోటలో గంటసేపు నిలిచీ ఆయన కోసం కనిపెట్టగలనా? కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికి సహాయపడగలనా? మరియయోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నీలబడగలనా? కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికిసహాయపదగాలనా? మరియ,యోహనుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబదగాలనా? క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ద వహించగలనా? అప్పుడే నా ఆరాధన సంపూర్ణం. నా దీవెన ఫలభరీతం. ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది. ఆయన నికృష్టస్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది. ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది. చివరికి నాకు తెలిసింది. నాకు కావలసింది బహుమతి కాదు. బహుమతినిచ్చే దాత. రాత్రిలో ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్న మాట.


శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం

దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే

నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు

ఏమి ఎదురైనా ఏ దారైనా.


దేవునిలో గమ్యాన్ని వెదికింది విశ్వాసం

గమ్యం చేరుస్తాడనీ నిరీక్షించింది ప్రేమ

నా విన్నపాలను అంగీకరించి

నడిపించాడాయనే కడదాకా.


చీకటిదారైనా, భారమైనా దూరమైనా

చెల్లించవలసిన ధర ఎంతైనా

గమ్యాన్ని నేనెలా చేరగలనో నేర్పాడు

ఆ దారి ఇరుకైన తిన్నని దారి.


ఆయన అడిగిన దానిని కాదనలేను

ఆయన చెంతకి చేరక ఉండలేను

అనుదినం నా ప్రభువుకి ఘనత

ఆ ఘనతలోనే నా జీవన ఫలం.

Share this post