Skip to Content

Day 343 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది (2కొరింథీ 4:18).


"మా కొరకు ... కలుగజేయుచున్నది" అనే మాటల్ని గమనించండి. మానవ జీవితంలో కన్నీరెప్పుడూ వరదలై పారుతూ ఉంటుందెందుకని? రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని? ఇలాటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పై వాక్యంలో దీనికి సమాధానం కన్పిస్తోంది. శ్రమలు మనకోసం కొన్ని ప్రశస్థమైన వాటిని సాధించి పెడుతున్నాయి. విజయ మార్గాన్నేకాక విజయసాధన సూత్రాలను కూడా అవి మనకి నేర్పుతున్నాయి. ప్రతి దుఃఖానికీ ఏదో ఒక నష్ట పరిహారం మనకి దక్కుతుంది. ఇంగ్లీషులో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది.


నీ వైపుకి చేరితే నాకదే చాలు

నీ చెంతకి దేవా నీ చేరువకి

సిలువ ఎక్కవలసి వచ్చినా


విచారపు కడుపునుంచే ఆనందం ఉద్భవిస్తుంది. "ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను" అంటూ ఫానీ క్రాన్బి ఎలా రాయగలిగిందంటే ఆమె ఎన్నడూ పచ్చని చేలనూ, సంధ్యకాంతులనూ, తల్లి కన్నుల్లోని మమతనూ చూడడానికి నోచుకోలేదు. కంటిచూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది.


విచారం కేవలం రాత్రి గడిచే మట్టుకే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి. ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది. వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుపాను రోజు చాలా తక్కువ కాలమే. రాత్రంతా విలాపాలున్నా, ఉదయాన ఆనందం ఉదయిస్తుంది.


కేరింతాలతో కాదు దాని మూలం

ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది

మనోనిబ్బరమే దాని ప్రాణం

ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం

Share this post