Skip to Content

Day 302 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును (మలాకీ 3:3).


పరిశుద్దులను మరింత పవిత్రులనుగా చెయ్యాలని చూస్తుండే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్నిజ్వాలల విలువ తెలుసు. ఎక్కువ విలువగల లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. దానిని అగ్నిలో కాలుస్తాడు. అప్పుడే కరిగిన లోహం దానిలో కలిసిన కల్మషాలతో వేరై నిర్మలం అవుతుంది. మూసలో పడి కంసాలికి అవసరమైన రూపును దిద్దుకుంటుంది. కంసాలి తన కొలిమి దగ్గర నుండి లేచి వెళ్ళిపోడు. లోహం కరగడానికి అవసరమైన వేడిమికంటే ఎక్కువ వేడి దానికి తగలకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అయితే కరిగిన లోహం ఉపరితలం పైనుండి మురికి నంతటినీ తీసెయ్యగానే తన ప్రతిబింబం దానిలో కనబడగానే ఆ మంటను ఆర్పేస్తాడు.


ఏడింతల వేడిమిలో మండే

కొలిమి దగ్గర కూర్చున్నాడు

వెండి కరుగుతుంటే

వంగి చూస్తూ ఉన్నాడు

ఇంకా ఇంకా మంట పెంచాడు

లోహం ఆ దహనానికి

తట్టుకోగలదని తెలుసతనికి

కావలసింది మేలిమి బంగారమే

రాజుకి కిరీటం చెయ్యాలి దానితో

కరుగుతుంటే కనిపించని మురికి

కడగా తేలి కనిపించింది

బంగారం ఇంకా ఇంకా ధగధగలాడింది.


యజమాని నైపుణ్యం తెలియదు మనకి

కనిపించేది అగ్ని జ్వాలే

భయాలూ బాధలూ ప్రశ్నలు

అన్నీ కరిగి ఉపరితలంలో

చివరికి ఆయన ఆకారం ప్రతిబింబించింది

ఆ కళ్ళల్లోని ప్రేమకాంతి తళుక్కుమంది

మనల్ని బాధించడం ఆయనకిష్టమా

లేదు ఈనాటి సిలువ

నానాటికీ మనకి లాభమే

ప్రేమతో ఆయన దృష్టి మనపై ఉంచాడు

కనిపెట్టి చూస్తున్నాడు

కావలసిన దానికంటే ఎంత మాత్రం

ఎక్కువ వేడి తగలనియ్యకుండా.

Share this post