Skip to Content

Day 274 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

శ్రమనొండి యుండుట నాకు మేలాయెను (కీర్తనలు 119:71).


విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి. రంగు రంగుల నాచు మొక్కలు, మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికీ సుడిగాలులు, తుపానులు సంభవిస్తూ ఉండే కొండకోనల్లోనే పెరుగుతాయి.


షెనె బెట్టాజ్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతంపైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను. ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది. అది సూర్యకాంతిలో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది.


ఆ శిఖరాల పైన, ఎక్కడో మారుమూలస, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవాన్నంతటినీ ప్రదర్శించింది. ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా యెదుట రెండు రకాల నాచుమొక్కలు ఉన్నాయి. ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది, రెండవది స్కాట్లాండ్ లోని ఒక కోటగోడపై మొలకెత్తిన నాచు. ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసేవాళ్ళకు ఇట్టే అర్థమైపోతుంది.


తుపానులను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఊదారంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది. మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచుమొక్కెతే తుప్పుపట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది.


శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే. తుపానులకు గురై, ఓదార్పుకు నోచుకోకుండా దేపుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా, యథార్ధంగా తయారవుతుంది. అతని జీవితానికి ఆ కష్టాలేవో వింతకాంతిని, ఆశీర్వాదాలను చేకూర్చిపెడతాయి.


నా దీవెనల గ్రంథంలో మొదట ఉంది

ముందు తగిలిన గాయాల ప్రసక్తి

ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని.

Share this post