Skip to Content

Day 272 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేను మానక ప్రార్థన చేయుచున్నాను (కీర్తనలు 109:4).


ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందర తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించివేస్తుంటారు. ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరైనా ఎప్పుడన్నా ప్రార్ధనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా? తన గదిలో ఏకాంతంగా గడపలేని వ్యక్తి ఎవరైనా ప్రార్ధనలో పవిత్రాత్మను పొందినట్టు ఎక్కడైనా చూశామా?


జార్జి విట్ ఫిల్డ్ అనే భక్తుడు "రోజుల తరబడి, వారాల తరబడి నేలమీద సాష్టాంగపడి ప్రార్ధనలో గడిపాను" అన్నాడు. "నీ మోకాళ్ళమీద నువ్వు ఉంటేనే నువ్వు ఎదగగలవు" అన్నది మరొక భక్తుని సాక్ష్యం. వీరంతా తమ అనుభవాలనే తమ మాటల్లో వ్యక్తపరుస్తున్నారు.


ఏకాంతాన్ని ప్రేమించని ఏ వ్యక్తి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సాహిత్యంలో గాని, విజ్ఞానశాస్త్రంలో గాని చిరస్మరణీయమైన కార్యాన్ని చెయ్యలేదు. నిజానికి ఈ ఏకాంతం అనేదాన్ని క్రైస్తవ జీవితంలో ఒక సూత్రంగా భావించవచ్చు. దేవునితో ఎక్కువ కాలం ఏకాంతంలో గడపకుండా ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎదుగుదల పొందడం అసాధ్యం.


అలసి సొలసిన హృదయమా, నా దగ్గరకు రా

నేను నడిపించే ఏకాంత స్థలానికి రా

లోక ధ్వనులకు దూరంగా నాతో రా

శాంతి నీ యెదలో సంగీతమై స్పందిస్తుంది

Share this post