- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీ 3:8).
ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం. కోత పనివాళ్ళ పాటలు వినిపించే కాలం. కాని పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్థి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక, మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలను కూడా సిలువ వెయ్యాలి.
నువ్వు ఫలించాలంటే చీకటిలోను, ఒంటరితనంలోను పాతిపెట్టబడాలి.
ఇది వింటుంటే భయం వేసింది. కాని ఆ ఆజ్ఞలను ఇచ్చింది యేసే గనుక ఆయన శ్రమల్లో పాలుపొందడం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారుచేస్తూ ఉంది. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాలనిచ్చింది. నా శ్రమలూ అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణంద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్య రహస్యం!
మొగ్గ విచ్చుకుని పువ్వులా మారితే
దాన్ని మరణం అని అంటామా?
వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే
ఆశీర్వదిస్తాడా ఆయన?
పరిశుద్దులు అపొస్తలులు, ప్రవక్తలు
హతసాక్షులు "అవును" అని పలికారు