- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
తన ప్రియునిమీద ఆనుకొని అరణ్యమార్గమున వచ్చునది ఎవతే? (పరమ 8:5).
ఒక సహోదరుడు ఒక మీటింగులో ప్రార్థిస్తున్నాడు. అందరూ అడిగినట్టే దేవుణ్ణి అన్నిరకాల దీవెనలూ అడిగాడు. అందరూ చెప్పినట్టే తనకు ఉన్న ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు చెప్పాడు. చివరిగా ఒక అసాధారణమైన విన్నపాన్ని కోరుకున్నాడు -"దేవా, మేము ఒరిగే అన్ని వైపులనుండీ మాకు ప్రాపుగా ఉండి నిలబెట్టు" మీకు ఆనుకునే పరిస్థితులేమైనా ఉన్నాయా. ఈ ప్రార్థన దానిపై ఒరిగేవాళ్ళ నిస్సహాయతనూ, నిలబెట్టేవాడి సర్వశ్రేష్టతనూ ఒక క్రొత్త దృక్పథంలో చూపిస్తున్నది. దేవుడు క్రైస్తవుని వెంటే నడుస్తున్నాడు. బలహీనులైన వారు తూలి ఒరిగిపోతున్న ప్రతివైపునా తన బలమైన హస్తాన్ని చాపి నిలబెడుతూ ఉంటాడు.
"నా ప్రియ కుమారుడా నా మీద ఆనుకో
నీ పనులభారం నన్ను మోయనీ
నీకున్న భారం నాకు తెలుసు, నీ మీద మోపింది నేనే
దాని బరువుకీ నీ శక్తికీ సామ్యం లేదు
నీమీద పెడుతున్నప్పుడే అనుకున్నాను
నేనూ అతనితో ఉంటాను
అతను నాపై ఒరిగితే అతని భారం నాదే
నా కౌగిట్లో ఉంచుతాను"
నీ బరువు నాపై వెయ్యి, సంకోచించకు
ప్రపంచాలను మోసే భుజాలు నావి
నా దగ్గరికి రా, నీ భారం నాకియ్యి
నా ఒడిలో విశ్రాంతి నొందు
నన్ను ప్రేమిస్తున్నావా, అయితే సందేహించకు
నాపై భారముంచి ఒరిగిపోవడమే నన్ను ప్రేమించడం"