Skip to Content

Day 242 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు, మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయువారు, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి (కీర్తనలు 107:23,24).


గాలి ఎటు వీచినా అది పరలోకానికి చేర్చు సాధనమే అని గ్రహించనివాడు జీవన నౌకాయానంలో అనుభవం లేనివాడే. గాలి లేకుండా ఉన్న స్థితే ఎవరికి ఉపయోగం లేని స్థితి. గాలి తూర్పుకి, పడమరకి వీచినా, ఉత్తర దక్షిణాలకి వీచినా పర్వాలేదు. ఎటు వీచినా నావను నౌకాశ్రయం వరకు నడిపించడానికి దాని సహాయం తీసుకోవచ్చు. సముద్రంలో లోపలికి వెళ్ళిపోవాలి. పెనుగాలులకు భయపడకూడదు. మన ప్రార్థన ఇలా ఉండాలి, "దేవా సముద్ర యానానికి మమ్మును పంపించు. లోతు ప్రదేశాలకు నడిపించు. ఇక్కడైతే కాస్త గాలి వీచగానే నావ కొట్టుకొని బ్రద్దలైపోతుందేమో, సముద్రంలోకి మమ్మల్ని పంపించు. అక్కడైతే విజయం సాధించడానికి చాలినంత చోటు ఉంటుంది"


శ్రమ వచ్చినప్పుడు మనకు ఉండే విశ్వాసం మిగతా రోజుల్లో ఉండదు అని గుర్తుంచుకోండి. పరీక్షకు నిలబడలేనిదంతా శరీర సంబంధమైన ఆత్మ విశ్వాసమే.


ప్రశాంత వాతావరణంలో ఉండే విశ్వాసం విశ్వాసం కానే కాదు.

Share this post