Skip to Content

Day 233 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

2 August 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను (కీర్తనలు 18:19).


ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులూ, ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. దావీదు అవమానాలు, దూషణలు, లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు.


"మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి" (నిర్గమ 19:4).


సంపూర్ణ విధేయతలోకి

నావ నడిపించడానికి భయపడుతున్నాను

"ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది?

నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది?"

"నాలోకే" అన్నాడు దేవుడు.


త్రవ్విన సమాధి పై నిలచి విలపించాను

రేకెత్తిన ఆవేదనతో అడిగాను

"నేను వేసే ఈ విచారపుటడుగులు

నన్నెటు నడిపిస్తున్నాయి?"

"నాలోకే" అన్నాడు దేవుడు.


ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు

నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు

ఇంతవరకు నన్నాకర్షించిన విషయాలన్నీ

ఆయన చెంతకే తీసుకొస్తాను..

Share this post