Skip to Content

Day 230 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

28 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

యెహోవా మాత్రము వాని నడిపించెను (ద్వితీ 32:12).


కొండెక్కడం కష్టంగా ఉంది

ఆయాసం తెలియకుండా

తోటివారెందరో ఉన్నారు

ఉన్నట్టుండి సన్నని దారి

అతి కష్టమైన దారి ఎదురైంది

ప్రభువన్నాడు, "కుమారుడా

నాతో ఒంటరిగా నడిస్తే మంచిది"


నెమ్మదిగా నడిపించాడు ముందుకి

చల్లని మాటలు చెబుతూ పై పైకి

తన ప్రేమ రహస్యాలు

నా భయాలూ బాధలూ చెప్పాను

ఆయన చేతిపై ఆనుకున్నాను

నా అడుగులు వేగం పుంజుకున్నాయి

మసక చీకటిలో గతుకులబాట

ఆయన సన్నిధిలో రాజమార్గమైంది


భయపడ్డాను నిశ్చలమైన

నమ్మకంతో జవాబిచ్చాను

"ఆలాగే ప్రభూ"

నా చెయ్యి పట్టుకున్నాడు

నా అభీష్టం ఆయనకప్పగించాను

ఆయనలో లీనమయ్యాను

చాలా కాలం ఆయన తప్ప

ఇతర మిత్రులెవరూ కనబడలేదు


నీ వాళ్ళెవరైనా నిన్నొదిలి పోయారా

త్వరలో కలుసుకుంటావు

ఊహించలేని ఆనందపు వెల్లువలో

పరలోకపు పాటలతో

గడిచిన బాటసారి జీవితాన్ని

అపురూపంగా నెమరువేసుకుంటూ

వీటన్నిటిలో ఒక జ్ఞాపకం

అపురూపంగా ఉంటుంది


ఆ పసిడి పట్టణంలో కలిసిన మనమంతా

కృతజ్ఞత నిండిన ప్రేమ స్వరాలతో

ఆ ఇరుకు బాటలో మనతో నడిచిన

యేసు ప్రేమను తలుచుకుంటాము


లోతైన లోయ ప్రక్కనే ఎత్తయిన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం జరగదు.


Share this post