Skip to Content

Day 140 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా (యోహాను 18: 11).


ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్యపెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రవత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి.


కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్లయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే, మన ఆత్మకు మరెన్నటికీ నయం కానీ గొప్ప గాయమవుతుంది. ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరు గ్రహించరు. కానీ మన ఆత్మ క్షేమంకోసం మనం తప్పకుండా తాగాలసిన ఈ చేదును మన ఆత్మమాంద్యంలో మత్తులో పక్కకి నెట్టేస్తాం.


ఆపైన "అయ్యో ప్రభూ! నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది" అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తిపారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మియ అభివృద్ధికి మూలం.


దేవా బాధని తొలగించు ఆక్రోశించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని భాదలనుండి విడిపించు బాధను రూపుమాపుమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకొని శక్తినొందె అవకాశాన్ని తీసెయ్యమంటావా.


Share this post