Skip to Content

Day 137 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నలువదిఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు... దేవదూత అతని కనబడెను... రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను (అపో.కా. 7: 30-34).


ఒక్కసారి దేవుడు మనల్ని కొంతకాలంపాటు మన పనీలో నుండి పక్కకు తప్పించి, ఊరకుండి, తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్నంతకాలం అంత వ్యర్థమైనదని అనుకోవడానికి వీలులేదు.


పూర్వం ఒక రైతు శత్రువుల బారినుండి తప్పించుకొని పారిపోతు కొంత సేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరిగా అని గ్రహించాడు. అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపొమ్మని గొడవ చేసేది. అయితే అంతకంటే ఎక్కువ అయినా నా వివేచనా శక్తేమో కమ్మరి పని వాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడ వేయించడమే మంచిదని బోధించింది. వెంటతరిమివాళ్ల గుర్రపుడెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించేవరకు నిలబడ్డాడు. ఇక శత్రువులు వంద గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదికి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు. అతను అక్కడ ఆగడం వల్ల అయిన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు.


ఎన్నో సార్లు మనం పరుగెత్తాలని ఉవ్విళ్లూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు. తర్వాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయ్యమంటాడు.


ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి. తర్వాత మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగిపొమ్మనేదాకా.


ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి. ఆశ అడుగంటనీయక దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి ఆయన నుండి తొలగిపోనీయక


వేచియుండాలి ఇంకా వేచియుండాలి దేవుడు జాగు చెయ్యడు. ఆయన తలుపు తెరవడం కోసం నేను వేచి ఉన్నట్లు ఆయనకు తెలుసు.


Share this post