- Author: Mrs. Charles Cowman
- Category: Inspirations
- Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
..... అగ్నిలో సంచరించుట చూచుచున్నాము (దానియేలు 3: 25).
వాళ్ల కదలికను అగ్ని ఆపలేకపోయింది. దాని మధ్యలో వాళ్లు నడుస్తున్నారు. తమ గమ్యానికి చేరడానికి అగ్ని కూడా ఒక రాజ మార్గమే. క్రీస్తు బోధనలోని ఒక ఆదరణ ఏమిటంటే ఆయన దుఃఖంనుండి విడుదల ఇస్తాననలేదు. దుఃఖం ద్వారా విడుదల ఇస్తానన్నాడు.
నా దేవా, చీకట్లో అలుముకున్నప్పుడు నేను కేవలం ఒక సొరంగంలో మాత్రమే ఉన్నాను అని నాకు జ్ఞాపకం చెయ్యి. కొంతకాలానికి అంతా చక్కబడుతుందని తెలియడమే నాకు చాలు.
నేను ఒలీవ కొండ శిఖరంమీద నిలబడాలట. పునరుత్తానపు మహిమలో పాలుపొందాలట. కానీ ప్రియ తండ్రి, ఆ శిఖరానికి నేను ఎక్కివెళ్లడానికి కల్వరి దారి కావాలి. ఈ లోకంలోని కష్టాల నీడలు మీ పరలోకపు ఇంటిదారిలోని చెట్ల నీడలే కదా. తండ్రి, నీ ఇల్లు కొండ మీద ఉంది. కష్టపడి నేనా కొండపైకి ఎగబ్రాకక తప్పదు. నేను అగ్నిజ్వాల మధ్యలో నడిస్తే నన్ను ఏ దుఃఖము అంటదు.
దారి కరుకుగా ఉంది చాలా దూరం పైకెక్కిపోవాలి పూలు కాదు ముళ్ళున్న దారి ఆకాశం మబ్బులు పట్టింది ఆ మసక వెలుగులో ఎవరో నా చేయి పట్టుకున్నారు నా దారంతా పూలబాటగా పరచుకొంది.
సిలువ భయంకరం నా వీపు మోయలేని భారం కర్కశం, కఠినం, పాశానం చేయూతనిచ్చే వాళ్ళు లేరు ఒకరు మెల్లగా నా భుజం తట్టారు "నాకు తెలుసు నేను నీకు తోడు నేనర్థం చేసుకోగలను"
ఎందుకు బాధ, నిట్టూర్పు సిలువ మోసేవాళ్ళలారా రండి గమ్యమదివో కనిపిస్తుంది మన కలలపంట కనుచూపుమేరలో ఉంది. మనం వేసే ప్రతి అడుగువేద్దాం ప్రభు సన్నిధిలో.