Skip to Content

Day 125 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి (2 దిన 20: 22).


మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే పాటలుపాడి స్తుతించడం ఎంత మంచిది! సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలువేసే గొలుసులుగా చేసుకుంటున్నాము. వాటి ద్వారా స్తుతిపాటలు పాడడం ఎలాగో నేర్చుకోము.


కొందరైతే తమకి ఆటంకాలు, అడ్డుబండలు పదే పదే వస్తున్నాయెందుకని తీవ్రంగా ఆలోచించి, జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలోతాను రంగులరాట్నంగా తిరుగుతూ, లోలోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్ధనా జెండాలుగా పైకెత్తి దేవుని ఘనపరిస్తే అది ఎంత మేలుకరం!


మన శ్రమలను ఆలోచించడం ద్వారా మర్చిపోలేం గానే హల్లేలూయా కీర్తనలు పాడటం ద్వారా రూపుమాపువచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి. పక్షులు మీతో శృతి కలుపుతాయి. పక్షులు ఉన్నంత హాయిగా, ఏ దిగులూ లేకుండా, నాకు తెలిసినంతవరకు మరే జీవి ఉండదు.


సాయం సమయాల్లో పాడండి. పిచ్చుకలు నిద్రపోయేముందు చేసే ఆఖరు పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది. గూటికి చేరుకున్నాయి. తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మ పై చతికిలబడి గొంతెత్తి దేవుణ్ణి కీర్తిస్తాయవి.


మనం కూడా ఉదయం, సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం! మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిపి దేవుణ్ణి స్తుతించాలి.


జీవనరాగాన్ని శృతి తప్పనియ్యకు తగ్గుముఖం పడితే పట్టవచ్చు అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది.


బ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించువచ్చు నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు దొలగి సూర్యుడు వస్తాడు.


జీవన రాగాల్ని శృతి తప్పనియ్యకు గొంతు తడబడితే తడబడవచ్చు. స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు ఆత్మలో నీపాట సాగిపోనీ


జీవన రాగాన్ని శృతి తప్పనియ్యకు ఇక్కడ ఉండుండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుందని మరో ప్రపంచంలో నీతో ఉంటుంది


Share this post