Skip to Content

Day 11 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)

  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, - నా జనులను ఓదార్చ డి ఓదార్చుడి. (యెషయా 40:1,2).


నీ దగ్గరున్న ఓదార్పును పోగు చేసుకుని ఉండు. ఇది దేవుడు యెషయా ప్రవక్తకిచ్చిన ఆజ్ఞ. ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది. ఈ గొప్ప సేవకు నువ్వు సరిపోతారు. అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం. అది సామాన్యమైన శిక్షణ కాదు. నువ్వు పూర్తిగా సుశిక్షితుడివి కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లోంచి రక్తాన్ని, కన్నీళ్ళని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి. దైవసంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. నీవు గాయపడాలి. నీ పరమవైద్యుడు నీ గాయాలకు కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చేయడం నేర్చుకోవాలి. నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు. కొన్నేళ్లు ఆగు. అలాటి స్థితిలోనే ఉన్న కొందరు ఊరడింపు కోసం నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వు వాళ్లకి చెబుతావు - "నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఓదార్పు కూడా దొరికింది" అని. నువ్వి మాటలు చెబుతూ, దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్లకి పూస్తూ, వాళ్ళ కళ్ళల్లోనే ఆశల మెరుపుల్ని, నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్లని చూసినప్పుడు - అప్పుడు దేవుణ్ణి కొనియాడతావు. నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం, ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు.


మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు, మనల్ని ఓదార్చేవాళ్లుగా చేయడానికే.


గులాబి రేకను

చిదిమి వెయ్యాలట

అలా చేస్తీనే వచ్చేది

పరిమళ తైలమట


కోయీలని పట్టి

పంజరంలో పెట్టాలట

అప్పుడే నిశాబ్దంలోంచి

దాని పాట మోగుతుందట


ప్రేమ రక్తం ఒలకాలట

స్నేహశత్రువులు చిందాలట

అప్పుడే వాటిని

ఈ లోకంలో సార్దాకతట


విలువైన వాటన్నిటి

కథలన్నీ ఇంతేనా

వాటి బ్రతుకుల్లో

సుకం లేదా ఏ రవ్వంతైనా


అవును, నలిగిన రాత్రులు

బందించిన పంజరాలు

నాటుకున్న ముళ్ళు

ఇవే మనకు దీవెనలు


Share this post