Skip to Content

Day 100 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)

25 July 2024 by
Sajeeva Vahini
  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియజేయుము (యోబు 10:2).


అలిసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చెయ్యడానికి, దేవుడు నిన్నిలా బాధలకి గురిచేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లోగాని బయటి!" తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగులాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనబడదు. నిరీక్షణ అనేది మిణుకు మిణుకుమనే తారలాటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు. శ్రమకాలంలో చీకటిరాత్రిలోనే దాన్ని చూడగలం. కష్టాలనేవి నల్లవి మఖమల్ గుడ్డల్లాటివి. వాటిలో దేవుడు వజ్రాలవంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి.

ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళూని ప్రార్థించావు, "ప్రభూ నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది. నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి" అని.


మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు. ఈ ప్రార్థనకి పర్యవసానం. ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నదీ లేనిదీ తెలిసేదీ? ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మన పైకి శ్రమలను పంపుతుంటాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు. ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి.


దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌకర్యాలు, సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు. బయట ఎండలో కవాతులు, కఠినమైన విశ్వాసాలతోనే. ఆయన వాళ్ళని సెలయేళ్ళ కడ్డంపడి నడవమంటాడు. నదుల్ని ఈదమంటాడు. కొండలెక్కమంటాడు. వీపుమీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్ అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణం ఇదే.


సైతాను మిమ్ముల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలులేదు


Share this post