Skip to Content

ఈ ప్రేమ ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తుంది.

    • Author: Dr G Praveen Kumar
    • Category: Devotions
    • Reference: Sajeeva Vahini

    ఈ ప్రేమ ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తుంది.

    దేవుని ప్రేమ యొక్క పరిమాణాన్ని పరిగణించినప్పుడు ఆ ప్రేమ విస్తారమైనది షరతులు లేనిది మన గత తప్పులు లేదా ప్రస్తుత పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి చేరువైంది. దేవుని ప్రేమ యొక్క బహుమానం మనం సంపాదించగలిగేది, ఇది ఉచితంగా ఇవ్వబడింది మనందరం చేయవలసింది కేవలం యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా ఆ ప్రేమను అంగీకరించడమే. 

     యోహాను 3: 16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.  

    బైబిల్లో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి మరియు ప్రతిష్టాత్మకమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్యం క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశాన్ని కూడా సంగ్రహిస్తుంది. ఇది మానవాళి పట్ల దేవుని యొక్క లోతైన మరియు త్యాగపూరిత ప్రేమ గురించి మాట్లాడుతుంది. దేవుని ప్రేమ కేవలం నైరుతి భావన కానే కాదు అది చర్య ద్వారా ఒక క్రియ ద్వారా నిరూపించబడింది మన పాపాల కోసం చనిపోయేలా ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు తద్వారా మనము నిత్యజీవము అనేటువంటి వరాన్ని పొందగలిగాము. ఈ వరం విశ్వాసం ద్వారానే మనము పొందుకోగలము. 

    ఈరోజు, మనం చేయవలసిందల్లా ఒక్కటే. మన వ్యక్తిగత ప్రార్థనలో ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవడమే. ఆ తండ్రి మనకు చూపించే అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు చెల్లించడమే. తన ఏకైక కుమారుని మన అనుగ్రహించినందుకు, నిత్యజీవమనే వరాన్ని కూడా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇటువంటి ప్రార్ధన ప్రయత్నం చేద్దామా. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్.



Share this post