Skip to Content

ఇది దేవుని పై మీకున్న నమ్మకాన్ని బలపరచుకోడానికి సహాయడుతుంది!

24 July 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

ఇది దేవుని పై మీకున్న నమ్మకాన్ని బలపరచుకోడానికి సహాయడుతుంది!

సామెతలు 3:5,6 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.

దేవునిపై మన పూర్తి నమ్మకాన్ని ఉంచడం యొక్క ప్రాముఖ్యతను గూర్చిన అద్భుతమైన సంగతిని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మన పూర్ణ హృదయంతో ప్రభువును విశ్వసించడం అంటే పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్న, సవాలుగా అనిపించినప్పటికీ, దేవునిపైనే పూర్తిగా ఆధారపడడం అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన పరిమిత అవగాహన నుండి దూరంగా వెళ్లి, మన జీవితంలోని ప్రతి విషయంలో ఆయన జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని వెతకడానికి ఈ వాక్యము మనల్ని ఈరోజు మనల్ని ఆహ్వానిస్తుంది. 

వాస్తవంగా మనము మన సొంత అవగాహనపై లేదా ఆలోచనలపై ఆధారపడినప్పుడు, మనం తరచుగా భయం సందేహం మరియు గందరగోళానికి గురవుతాము. అయితే మన మార్గాలను దేవునికి సమర్పించడం అనే ఆలోచన వినయం మరియు విశ్వాసం యొక్క చర్యను కలిగి ఉంటుంది. ఆయన ప్రణాళికలు మనకంటే మన ఆలోచనలకంటే గొప్పవని అంగీకరించినప్పుడు,  ఇటువంటి సమర్పణ భావం - మనం మన మార్గాలను నిర్దేశించడానికి ఆయనను అనుమతించినప్పుడు, మనముసరైన మరియు ప్రయోజనకరమైన మార్గంలో నడువగలుగుతాము.

అయితే ఈరోజు ఈ పని చేయండి - మీ జీవితంలో దేవుణ్ణి పూర్తిగా విశ్వసించడానికి మీరు శ్రమ పడేటువంటి విషయాలు గురించి ఒకసారి ఆలోచన చేయండి, వాటిని దేవుని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రార్థన చేసి, వాక్యం చదివి తద్వారా దేవుని మార్గదర్శకత్వాన్ని వెతకడానికి మరొకసారి ప్రయత్నం చేయండి. ఇంతవరకు మీ జీవితంలో దేవుని విశ్వసనీయతను మీరు చూసినటువంటి సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, లేదా ఒక పేపర్ మీద వ్రాసి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఇలా చేసినప్పుడు, ఆయనపై మీకున్న నమ్మకాన్ని బలపరచుకోడానికి సహాయడుతుంది.

మనం చేయవలసిన ప్రార్థన ఒకటే, తండ్రి మా జీవితాల కోసం మీరు ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నారని తెలుసుకున్నాము. మా ఆందోళన మరియు అనిశ్చితులను వదులుకొడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తానికి లొంగిపోయే జ్ఞానాన్ని మరియు మీరు మాకొరకు సిద్ధపరచిన మార్గాన్ని అనుసరించే ధైర్యాన్ని మాకు దయజేయండి. ఈ ప్రార్థన మన జీవితంలో  కొత్త ద్వారాలను తెరిచినటువంటి అనుభవం వైపు నడిపిస్తుంది. ఆమెన్.



Share this post