Skip to Content

యేసు సిలువలో పలికిన రెండవ మాట | Second word of sayings of Jesus Christ on the Cross.

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - రెండవ మాట

మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు.

సర్వశక్తిగల సర్వాంతర్యామియైన దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సుళువుగా చేయగలడను మాట నమ్మని వారెవరు లేరు. అయితే, మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి... ప్రశ్నలు అనేకం. నేను ప్రార్ధించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? నా ప్రార్ధన దేవుడు విన్నాడా? వినలేదా? అసలు దేవుడున్నాడా...? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో.

నేనంటాను, నా ప్రార్ధన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే, నా ప్రార్ధన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునే వారు - మరియు - నా ప్రార్ధన దేవుడు వినికూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునే వారంటేనే దేవునికి ఇష్టం.

ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు; వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు కాని మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువని నమ్మి "నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకోమని" వేడుకున్నాడు.

మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆక్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసు క్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు... ప్రశ్నలు అడుగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలే అడగలేదు. మారు మాట్లాడకుండా "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు" అని అన్నాడు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనమున్నా...సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తు క్రమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ.

నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను లూకా 23:43

Telugu Audio: https://youtu.be/0sQ4IJXg1GQ

Second word of sayings of Jesus Christ on the Cross.

When good things happen in life, we say yes, God exists and when bad things happen ,we are the same people who say-Is there truly a God? We often hear people saying-Why do these challenges occur to me if there is a real God? And there are also people who keep praying-"God, grant your mercy to my  undeserving life"

None can dispute the strength of the All-Powerful God, Who can make any task simple. Questions arise when things don-t go as expected, though. Why wasn-t my request answered after I prayed? When will God answer my prayer? Did God really  hear my prayers? Does God really exist? There are numerous similar queries.

I assert that God favours those who check themselves to see that if there is something that has become an obstacle for God to answer their prayer and also those who ask for correction if there is any reluctance in them than those who wonder what’s wrong why God is not responding.

On either side of Jesus- crucifixion, two of these characters were present; they too were crucified with him. When faced with difficulty, one blasphemed, but the other acknowledged that he was guilty for all the things done in his life and now  he was being punished for his misdeeds. Additionally, he said "Jesus, remember me when you come into your kingdom!" and declared his belief in Jesus Christ as Lord.

The man-s repentance at the death door, changed his destiny. Jesus Christ listened to the man-s statements without interrogation, condemnation, or justification. Without any questions asked all He said was "Today you are in paradise with me, "in Luke 23:43.This is the magnificence of Power of  cross. It is at the cross, we discover forgiveness, regardless of the life we lead or the circumstances we find ourselves entangled in. We are given this salvation through the sacrificial love of Jesus Christ.

English Audio: https://www.youtube.com/watch?v=BKIxUwimyTA

Share this post