Skip to Content

యేసు సిలువలో పలికిన ఆరవ మాట | Sixth Word: Sayings of Jesus on the Cross

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

యేసు సిలువలో పలికిన ఏడు మాటలు - ఆరవ మాట

"సమాప్తమైనది" అను మాట గ్రీకు భాషలో అర్ధం "పూర్తిగా చెల్లించెను".

యేసు క్రీస్తు సిలువలో ఈ మాటను పలికినప్పుడు, తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. "చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని". ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొని; అనగా, మనం తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు సిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు.

మెస్సయ్యను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు సిలువ త్యాగంలో సంపూర్ణమై సమాప్తమైనది. నశించినదానిని వెదకి రక్షించాలనే తన మొదటి రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. ఏ భేదమును లేక అందరునూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసు క్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్నమనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది.

"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని." అను మాటను సంపూర్ణంగా నెరవేర్చాడు. ఎట్లనగా, తండ్రి మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, యేసు క్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరచెనను కార్యము సిలువలో సమాప్తమైనది. సిలువలో శ్రమ, సిలువలో మరణంపై విజయం సమాప్తమైనది.

పరిపూర్ణమైనవాడు, అసంపూర్ణమైన మన కొరకు తన్ను తాను అర్పించుకొనుటకు సిద్ధపడ్డాడు. తద్వారా అసంపూర్ణులమైన మనం ఆయనలో పరిపూర్ణులం అవుతాము.ప్రస్తుతం నేను అసంపూర్ణుడను, క్రీస్తు సిలువ సంపూర్ణమవుతేనే, ఒకనాడు మహిమలో క్రీస్తుతో నేను పరిపూర్ణుడవుతాను. అప్పుడు యేసులాగే ఉంటాను. ఆమేన్!

Telugu Audio: https://youtu.be/VmthZnujdI0

Sixth Word: Sayings of Jesus on the Cross

The word "finished" in Greek means "paid in full".

By saying this phrase while he was hanging on the cross, Jesus Christ completed the task the Father had given him. "I have finished the responsibility you gave me to complete, and I have exalted you in the earth." He gave himself as a ransom for everyone, which means that Christ bore the whole cost of the debt we owed the Father by dying on the cross in our place.

Every prophecy about messaih was fulfilled through the suffering of Christ on Cross. The reason for the first coming of mesaiah was to save the lost and was accomplished. He finished the responsibility given to him by the father.

For everyone has sinned; we all fall short of God-s glorious standard. Yet God, in his grace, freely makes us right in his sight. He did this through Christ Jesus, when he freed us from the penalty for our sins and the purpose of Jesus coming into this world was fulfilled.

"For i have come down from heaven, not to do My own will, but to do the will of Him who sent Me "was completed. Now we have peace with God through Jesus and have been sanctified through him was finished. Every burden was taken up on Cross  and victory over death attained and finished.

Our perfect God  sacrificed himself to make us blameless and submitted to Gods will. In him alone we are holy and whole. Its only through Christ we become whole and one day will partake in His glory and be perfect as him. Amen

English Audio: 

Share this post