Skip to Content

తర తరములకు ఆశీర్వాదాలు | The Inheritance Of Blessing

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

తర తరములకు ఆశీర్వాదాలు 

ద్వితీయోపదేశకాండము 30:5 నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.

1948 న ఇశ్రాయేలు తన పూర్వ వైభవాన్ని పొందుకుంది. అంతటా చెల్లాచెదురుగా ఉన్న యూదులు ప్రపంచ నలుమూలల నుండి తమ దేశానికి తరలివచ్చారు. నేడు ఇజ్రాయెల్ అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి అగ్రస్థానంలో ఉంది. దేవుడు భూమిని ఆశీర్వదించాడు మరియు ఇశ్రాయేలీయులను తిరిగి వారి దేశానికి చేర్చాడు మరియు దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి తన ఆశీర్వాదాలు కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం ద్వారా మనం ఒకటి గ్రహించాలి, దేవుడు తన విశ్వసనీయతను తరతరాలకు అందిస్తాడు. మనం ఆయనను అబ్రాహాము దేవుడుఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు అని సంబోధించడంలో ఆశ్చర్యం లేదు, ఆశీర్వాదం యొక్క వారసత్వం మరియు దేవుని విశ్వసనీయత నేటికీ కొనసాగుతోంది.

నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి, మన జీవిత ప్రయాణంలో ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మరియు మనకు మార్గనిర్దేశం చేస్తాడు. దేవుని విశ్వసనీయతపై మనం ఎల్లప్పుడూ ఆధారపడవచ్చు. ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు వదిలిపెట్టడు. కష్టాలు వచ్చినా ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన మనకు అండగా ఉంటాడు మరియు ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించే శక్తిని దయజేస్తాడు. జీవితంలోని అన్ని రంగాలలో ఆయన మనల్ని ఆశీర్వదించి, సంపన్నులుగా చేస్తాడు. ఆయన వాగ్దానాలలో మనం ఓదార్పు మరియు హామీని పొందవచ్చు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/vtmqCvMQr4E

The Inheritance Of Blessing

Deuteronomy 30:5 He will bring you to the land that belonged to your fathers, and you will take possession of it. He will make you more prosperous and numerous than your fathers.

1948 marks the establishment of the state of Israel. Jews that were scattered all throughout were gathered from all over the globe, to their land. Today Israel has the most advanced technology and is one among the top. God has blessed the land and gathered all the Jews back to their nation and God continued to bless them as He was with their forefathers and fathers. By this we know, God is always faithful and will always provide for us even for generations. No wonder we address Him as God of Abraham, God Of Isaac and God of Jacob as the legacy of blessing and Gods faithfulness continues, even Today.

He will be with us and guide us as we journey through life. God-s faithfulness is something that we can always depend on. He will never leave us nor forsake us. He will always be with us even when times are hard. He will provide for us and give us the strength to overcome any obstacle. He will make us blessed and prosperous in all aspects of life. We can find comfort and assurance in His promises. 

Connecting With God

English Audio: https://youtu.be/fW4gNy0icZA

Share this post