Skip to Content

శ్రమకు బాధకు ముగింపు | With the King

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

శ్రమకు బాధకు ముగింపు

యెషయా 33:17 అలంకరింపబడిన రాజును నీవు కన్నులార చూచె దవు బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కన బడును.

ఒకనాడు మనందరికీ ఆ నిత్యరాజ్యంలో మన నీతి సూర్యుడైన యేసు క్రీస్తు సౌందర్యమైన ముఖదర్శనం చూడగలమనే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ కేవలం నైరూప్య భావన మాత్రమే కాదు, ఈ రోజు మనం మన జీవితాల్లో అనుభవించగల సజీవ వాస్తవికత అని గ్రహించాలి.

మన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినప్పుడు, మనం పొందుకునే బహుమానం నిత్యజీవం. అంతే కాదు, ఆ నిత్యరాజ్యంలో ఇక ఎన్నడు శ్రమ, బాధ, మరణం ఉండదనే వాగ్దానం కూడ పొందుకున్నాము. ఆ రాజ్యంలో మన యేసయ్యను అధికమైన నిత్య మహిమలో, పరిపూర్ణమైన ప్రేమ, కృప మరియు దయలో ఆయనను వీక్షించగలము.

అవును, పరలోకంలో మనం పొందుకోబోయే నిరీక్షణ ఎట్టిదో, ఈ రోజే మన దైనందిన జీవితంలో ఆ నిరీక్షణను అనుభవించవచ్చు. మనం ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, ఆరాధించేటప్పుడు, మనం యేసు క్రీస్తు యొక్క మహిమను వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. మనం ఆయనను వెతుకుతున్నప్పుడు, ఆయనను గూర్చి మరింత తెలుసుకుంటాము మరియు ఆయన మనకు వాగ్దానం చేసిన సమృద్ధిగల జీవితాన్ని అనుభవిస్తాము.

ఈరోజు, యేసు క్రీస్తుపై మన కన్నులను నిలిపి, మహిమలో ఆయనను చూసే రోజు కోసం ఎదురుచూద్దాము. మనం ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన తనను తాను వెల్లడిస్తాడని విశ్వసిస్తూ, మన దైనందిన జీవితంలో ఆయన మహిమను అనుభవించడానికి కూడా ప్రయత్నిస్తాము. మన నిరీక్షణ కేవలం ఈ జీవితానికి మాత్రమే కాదు, మన రారాజు సన్నిధిలో ఆయనతో శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/0otPBifFS7c

With the King

Isaiah 33:17 Your eyes will see the king in his beauty and view a land that stretches afar.

We have a hope of seeing the beauty of the King, which is Jesus Christ. We have a promise of a better land that stretches beyond this present world. This hope is not just an abstract concept, but a living reality that we can experience in our lives today.

When we place our faith in Jesus, we are given the gift of eternal life, and we are promised a future with Him in a place where there will be no more pain, suffering, or death. We will see Jesus in all His beauty, and we will experience the fullness of His love, grace, and mercy.

In the meantime, we can experience a foretaste of this hope in our daily lives. When we pray, read the Bible, and worship, we can encounter the presence of Jesus and experience His beauty in a personal way. As we seek Him, we will come to know Him more intimately and experience the abundant life that He promises us.

Today, let us fix our eyes on Jesus and look forward to the day when we will see Him in all His glory. Let us also seek to experience His beauty in our daily lives, trusting that He will reveal Himself to us as we seek Him. Let us remember that our hope is not just for this life, but for eternity in the presence of the King in all His beauty.

English Audio: https://youtu.be/c5NFRZTOB_0

Share this post